అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఓ గుడ్‌న్యూస్..! తల్లిదండ్రులకు పర్యాటక వీసా రాకపోతే..

ABN , First Publish Date - 2022-10-01T02:41:59+05:30 IST

అమెరికా వీసా అపాయింట్‌మెంట్(Visa appointment) కోసం రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి.. భారతీయులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. అమెరికా పర్యటన అంటేనే టెన్షన్ మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా.. భారతీయులకు ఊరటనిచ్చే ఓ గుడ్ న్యూస్ చెప్పింది.

అమెరికాలోని భారతీయ విద్యార్థులకు ఓ గుడ్‌న్యూస్..! తల్లిదండ్రులకు పర్యాటక వీసా రాకపోతే..

ఎన్నారై డెస్క్: అమెరికా వీసా అపాయింట్‌మెంట్(Visa appointment) కోసం రెండేళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి.. భారతీయులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. అమెరికా పర్యటన అంటేనే టెన్షన్ మొదలయ్యే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా.. భారతీయులకు ఊరటనిచ్చే ఓ గుడ్ న్యూస్ చెప్పింది. స్టూడెంట్ వీసాపై(Student Visa) అమెరికాలో ఉంటున్న భారతీయులు.. భారత్‌తో సహా ఇతర దేశాల్లో పర్యటించాక వీసా స్టాంప్(Visa stamp) అవసరం లేకుండానే దేశంలోకి అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. వీసా స్టాంప్ మాత్రమే కాకుండా.. ఎలాంటి ఇంటర్వ్యూలేవీ ఉండవని స్పష్టం చేసింది. స్టూడెంట్ వీసాదారులతో పాటూ ఓపీటీ ట్రెయింగ్‌లో(Opt) ఉన్న వారికీ ఈ మినహాయింపు వర్తించనుంది. 


ఈ ప్రకటనతో భారతీయ విద్యార్థులకు భారీ ప్రయోజనం చేకూరిందని పరిశీలకులు చెబుతున్నారు. వీసా జారీలో జాప్యం కారణంగా తల్లిదండ్రులు అమెరికాకు రాలేని పక్షంలో.. వారి పిల్లలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా భారత్‌కు వెళ్లొచ్చే అవకాశం చిక్కింది. ఎఫ్-1 స్టూడెంట్ వీసాతో(F-1 Visa) పాటూ ఓపీటీపై ఉన్న వారు కూడా నిశ్చింతగా భారత్‌కు వచ్చి వెళ్లొచ్చు. ఇక ఎఫ్-1 వీసా కలిగిన విద్యార్థులు.. ఓపీటీ సాయంతో తమ కోర్సుకు సంబంధించి అమెరికాలో ఉద్యోగం చేయ్యొచ్చు. కోర్సు చదువుతూ ఉండగా.. ప్రీ కంప్లీషన్ ఓపీటీ, కోర్సు పూర్తయ్యాక పోస్ట్ కంప్లీషన్ ఓపీటీ సాయంతో వారు అమెరికాలో పనిచేసుకోవచ్చు. ఓపీటీ అనుమతి కోసం ముందుగా విద్యార్థులు తమ యూనివర్శిటీలోని డీఎస్ఓ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డీఎస్ఓ అధికారి అనుమతి పొందాకే విద్యార్థులు ఓపీటీ కింది తమ కోర్సుకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగం చేస్తూ అనుభవం గడించవచ్చు.

Updated Date - 2022-10-01T02:41:59+05:30 IST