బ్రిటన్ వీసా విధానాన్ని సమీక్షించనున్న ప్రధాని లిజ్ ట్రస్

ABN , First Publish Date - 2022-09-28T02:56:30+05:30 IST

బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్(Liz Truss) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ వీసా విధానాలను పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

బ్రిటన్ వీసా విధానాన్ని సమీక్షించనున్న ప్రధాని లిజ్ ట్రస్

ఎన్నారై డెస్క్: బ్రిటన్ నూతన ప్రధాని లిజ్ ట్రస్(Liz Truss) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. బ్రిటన్ వీసా విధానాలను పూర్తిస్థాయిలో సమీక్షించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. దేశంలోని అనేక రంగాల్లో కార్మికులు, ఉద్యోగులతో సతమతమవుతున్నాయి. విదేశీ నిపుణులతో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని వీసా విధానాలపై(Visa policy) సమీక్ష ప్రారంభించనున్నారు. వలసలను(Immigration) వ్యతిరేకించే సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా పక్కనపెట్టి.. కార్మికుల కొరత అధికంగా ఉన్న రంగాల జాబితా తయారీకి అనుమతించేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. 


అంతేకాకుండా.. బ్రిటన్‌లో పనిచేసేందుకు ఆంగ్లంపై పట్టుఉండాలన్న నిబంధనకు కూడా కొంత మేర సడలింపు ఇవ్వనున్నారట. అయితే.. ఇది నిబంధనల సరీకరణ కాదని బ్రిటన్ ఆర్థికశాఖ మంత్రి క్వాసీ క్వార్టెంగ్ వ్యాఖ్యానించారు.‘‘ఇది నిబంధనల సరళీకరణకు సంబంధించిన విషయం కాదు. బ్రిటన్ ప్రయోజనాలకు తగినట్టుగా వలసల విధానాన్ని నియంత్రించాలన్న అంశంపైనేు బ్రెగ్జిట్ చర్చలు జరిగాయి’’ అని వ్యాఖ్యానించారు. బ్రిటన్‌లో విదేశీయులను నియమించుకునేందుకు అనుమతి ఉన్న రంగాల సంఖ్యను పెంచుతారా లేదా అనేది రాబోయే రోజుల్లో చెబుతామని పేర్కొన్నారు. ఇక బ్రిటన్‌ ఆర్థిక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు కఠినమైన నిర్ణయాలను తీసుకునేందుకు తాను వెనకాడనని బ్రిటన్ ప్రధాని ఇటీవలే వ్యాఖ్యానించారు. 

Read more