Kuwait: అనుమానాస్పదం.. 24 గంటల వ్యవధిలో 3 మృతదేహాలు లభ్యం

ABN , First Publish Date - 2022-09-11T17:41:42+05:30 IST

కువైత్‌ (Kuwait)లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ముగ్గురు వ్యక్తుల శవాలు (corpses) లభ్యం కావడం కలకలం రేపుతోంది.

Kuwait: అనుమానాస్పదం.. 24 గంటల వ్యవధిలో 3 మృతదేహాలు లభ్యం

కువైత్ సిటీ: కువైత్‌ (Kuwait)లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ముగ్గురు వ్యక్తుల శవాలు (corpses) లభ్యం కావడం కలకలం రేపుతోంది. మొదటి మృతదేహాం ఫహాహీల్‌ ప్రాంతంలో దొరికిన 24 గంటల వ్యవధిలోనే అల్-దబైయా, అల్-ఖైరాన్ ప్రాంతాలలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు కువైత్ పోలీసులు వెల్లడించారు. 


మొదట ఫహాహీల్‌లోని బహిరంగ ప్రదేశంలో పార్క్ చేసి ఉన్న కారులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఆ తర్వాత అల్-ఖైరా శివారులోని వాహనంలో మరో గుర్తు తెలియని యువతి శవం కనిపించింది. అనంతరం అల్-దబైయా తీరంలో మరో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు కువైత్ పోలీసులు వెల్లడించారు. దీంతో వారి మృతికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారిని ఎవరైనా హత్య చేశారా? లేదా వాళ్లే సూసైడ్ చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. 


Updated Date - 2022-09-11T17:41:42+05:30 IST