డబ్బుల్లేక.. ఆకలి తట్టుకోలేక.. 16 మంది అబ్బాయిలతో వరుసగా..

ABN , First Publish Date - 2022-04-11T01:53:25+05:30 IST

కడుపులో ఆకలి దంచేస్తోంది.. ఆహారం కొనుక్కోవడానికి చేతిలో డబ్బులేవు..అప్పుడేం చేయాలి? ఈ పరిస్థితిల్లో ఉన్న వారెవరైనా రకరకాల మార్గాలు వెతుకుతారు.ఇక మెక్‌కాల్ బ్రూక్ అనే యువతి మాత్రం డేటింగ్‌లకు వెళ్లింది.

డబ్బుల్లేక.. ఆకలి తట్టుకోలేక.. 16 మంది అబ్బాయిలతో వరుసగా..

ఎన్నారై డెస్క్: కడుపులో ఆకలి దంచేస్తోంది.. ఆహారం కొనుక్కోవడానికి చేతిలో డబ్బులేవు..అప్పుడేం చేయాలి?  ఈ పరిస్థితిల్లో ఉన్న వారెవరైనా రకరకాల మార్గాలు వెతుకుతారు.ఇక మెక్‌కాల్ బ్రూక్ అనే యువతి మాత్రం డేటింగ్‌లకు వెళ్లింది. అదేంటి డేటింగ్‌తో ఆకలి ఎలా తీరుతుంది అంటారా..? మరేం లేదు.. ఆమె గురించి మరింతగా తెలుసుకునే క్రమంలో అబ్బాయిలందరూ మెక్‌కాల్‌ను రెస్టారెంట్‌కు తీసుకెళ్లేవారు. అక్కడ ఫుడ్‌కు అయ్యే ఖర్చంతా వాళ్లే భరించే వాళ్లు. ఇలా పైసా ఖర్చు పెట్టకుండానే ఆమె ఆకలి తీరేది. ఈ విషయాలన్నీ మెక్‌కాల్ స్వయంగా టిక్‌టాక్‌లో చెప్పుకొచ్చింది. వరుసగా 16 రోజుల పాటు అబ్బాయిలతో ఇలా డేటింగ్‌లకు వెళ్లానని చెప్పుకొచ్చింది.


కాలేజీ రోజుల్లో తన వద్ద డబ్బులు లేని సమయంలో ఇలా చేసేదాన్నని తెలిపింది. ఇలాంటి విషయాన్ని షేర్ చేయడంతో మెక్‌కాల్ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఏకంగా 1.5 మిలియన్ వ్యూస్ వచ్చిపడ్డాయి. మరి నెటిజన్లు కూడా ఇదే రేంజ్‌లో రియాక్టయ్యారు. ‘శభాష్.. అదరగొట్టేశావ్‌గా..’ అంటూ కొందరు మెక్‌కాల్‌ను పొగడ్తల్లో ముంచెత్తితే.. మరికొందరు మాత్రం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘నమ్మి వచ్చిన వారిని మోసగించావ్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే..ఆకలేస్తోందనే ఇలా చేశానంటూ మెక్‌కాల్ మాత్రం కూల్‌గా జవాబిచ్చింది. మరి ఆమె చేసింది తప్పంటారా.. రైటంటారా..?

Read more