అమెరికాలో తక్కువ ధరకు పెట్రోల్ అమ్ముతున్న భారతీయుడు.. తనకు నష్టం వస్తున్నా లేక్కచేయక.. కారణం ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-13T01:55:03+05:30 IST

సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సేవ చేయాలనేది పెద్దల మాట. కానీ.. అమెరికాలోని ఓ భారతీయుడు మాత్రం తనకు నష్టం వస్తున్నా కూడా లెక్క చేయకుండా పొరుగువారికి సాయపడుతున్నాడు.

అమెరికాలో తక్కువ ధరకు పెట్రోల్ అమ్ముతున్న భారతీయుడు.. తనకు నష్టం వస్తున్నా లేక్కచేయక.. కారణం ఏంటంటే..

ఎన్నారై డెస్క్: సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారికి సేవ చేయాలనేది పెద్దల మాట. కానీ.. అమెరికాలోని ఓ భారతీయుడు మాత్రం తనకు నష్టం వస్తున్నా కూడా లెక్క చేయకుండా పొరుగువారికి సాయపడుతున్నాడు. అందుకే ఆయన పేరు ప్రస్తుతం సోషల్  మీడియాలో మారుమోగిపోతోంది. నెటిజన్ల ప్రశంసల్లో మునిగితేలుతున్న ఆయన పేరు జస్విందర్ సింగ్.


అమెరికాలోని ఫీనిక్స్ నగరానికి(అరిజోనా రాష్ట్రం) చెందిన జస్విందర్ సింగ్‌కు ఓ పెట్రోల్ బంక్ నడుపుతున్నారు. అయితే.. ధరల భారంతో నిత్య నరకం అనుభవిస్తున్న సాటి అమెరికన్లకు తన వంతు సాయంగా తక్కువ ధరకే పెట్రోల్ అమ్ముతున్నాడు. తాను కొనుగోలు చేసిన ధరకంటే..47 సెంట్లు తక్కువగా 5.19 డాలర్లకే గ్యాలన్  పెట్రోల్ అమ్ముతున్నారు. అంతేకాకుండా.. ఇలా వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు జస్విందర్ సింగ్ దంపతులు  రోజులు మరిన్ని గంటలు ఆర్జనకే కేటాయిస్తున్నారు. ‘‘ప్రజలు దగ్గరు ఇప్పుడు డబ్బులు లేవు. అయితే..  మన దగ్గర ఉన్నదాంట్లోనే ఇతరులకు వీలైనంతగా ఇవ్వాలని మా అమ్మానాన్న చెబుతుండేవారు’’ అని జస్విందర్ మీడియాకు తెలిపారు. ‘‘నాకు అవసరం వచ్చినప్పుడు దేవుడు ఆదుకున్నాడు. ఇది లాభాల కోసం పాకులాడాల్సిన సమయం కాదు. ఇతరులకు నాకు చేతనైనంత సాయం చేయగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.’’ అని చెప్పారు. అందుకే స్థానికులు జస్విందర్ సింగ్‌ను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.  

Updated Date - 2022-06-13T01:55:03+05:30 IST