డబ్బునోళ్లు అంతే.. నేను మాత్రం డిఫరెంట్.. ఎలాన్ మస్క్ వైరల్ ట్వీట్

ABN , First Publish Date - 2022-05-25T03:37:26+05:30 IST

: అపరకుబేరుడు, టెస్లా అధినేత ఏం ట్వీట్ చేసినా ఇట్టే వైరల్ అవుతుంది. ఆయన ఎంచుకునే అంశాలే ఇందుకు కారణం. తాజాగా ఆయన మరో వైరల్ ట్వీట్ చేశారు.

డబ్బునోళ్లు అంతే.. నేను మాత్రం డిఫరెంట్.. ఎలాన్ మస్క్ వైరల్ ట్వీట్

ఎన్నారై డెస్క్: అపరకుబేరుడు, టెస్లా అధినేత ఏం ట్వీట్ చేసినా ఇట్టే వైరల్ అవుతుంది. ఆయన ఎంచుకునే అంశాలే ఇందుకు కారణం. తాజాగా ఆయన మరో వైరల్ ట్వీట్ చేశారు. డబ్బున్నోళ్లలో తాను డిఫరెంట్ అని చెప్పుకొచ్చారు. ‘‘సాధారణంగా డబ్బునోళ్లకు పిల్లలు తక్కువగా ఉంటారని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ ట్రెండ్‌కు నేను మినహాయింపు. నాకు తెలిసి చాలా మంది ఒక్క సంతానంతోనే సరిపెట్టేశారు.’’ అని చెప్పారు. అంతకుముందు ఆయన ప్రపంచ జానాభాకు సంబంధించి మరో ఆసక్తి కర ట్వీట్ చేశారు. తక్కువ మంది సంతానాన్ని కంటే పర్యావరణానికి మేలుకలుగుతుందన్న భావన తప్పంటూ తేల్చేవారు. గతంలో ప్రజల్లో అలాంటి ఆలోచన ఉండేదని, కానీ అదంతా నాన్‌సెన్స్ అని స్పష్టం చేశారు.    
Read more