Bathukamma: పిట్స్‌బర్గ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుక

ABN , First Publish Date - 2022-10-11T13:01:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో తెలుగు ప్రవాసులు బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు.

Bathukamma: పిట్స్‌బర్గ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుక

పిట్స్‌బర్గ్‌: అగ్రరాజ్యం అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం పిట్స్‌బర్గ్‌లో తెలుగు ప్రవాసులు బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో 350 మందికి పైగా ఆడపడచులు పాల్గొన్నారు. వారంతా సంప్రదాయ వస్త్రాలు ధరించి తాము తయారుచేసిన బతుకమ్మలను చేత బట్టుకుని రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మల చుట్టు ఉయ్యాల పాటలు పాడుతూ నృత్యాలు చేసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం బతుకమ్మలని నిమజ్జనం చేసి మలిదాప్రసాదాన్ని పంచుకున్నారు. అటు నిర్వాహకులు ఉత్తమ బతుకమ్మలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అనంతరం ఈ వేడుకకు హాజరైన వారికి పసందైయిన తెలుగు వంటకాలను వడ్డించారు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తోడ్పాటు అందించిన వాలంటీర్స్, స్పాన్సర్స్‌కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.   Read more