TANTEX నెలనెలా తెలుగు వెన్నెల 180 వ సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-07-27T23:59:32+05:30 IST

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 23న 15వ వార్షికోత్సవం, 180వ నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం సెయింట్ మేరీస్ మళంకర చర్చిలో వైభంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన సభకు విచ్చేసిన సా

TANTEX నెలనెలా తెలుగు వెన్నెల 180 వ సాహితీ సదస్సు

ఎన్నారై డెస్క్: నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 23న 15వ వార్షికోత్సవం, 180వ నెల నెల తెలుగు వెన్నెల కార్యక్రమం సెయింట్ మేరీస్ మళంకర చర్చిలో వైభంగా జరిగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారం తెలిపి, కార్యక్రమం పుట్టుపూర్వోత్తరాలను సభికులకు గుర్తు చేశారు. నెల నెలా తెలుగు వెన్నెల 15వ వార్షికోత్సవానికి విచ్చేసిన విశిష్ట అతిథులు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ బృందం, సాహితీ ప్రియులందరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రామన్ని ప్రారంభించారు. ప్రముఖ గాయని ఆశా కీర్తి పిల్లలు శ్రీకరి లంక, కేశవ లంక.. వినాయకుడిని పూజిస్తూ తమ శ్లోకాలతో సాహితీ ప్రియులను పరవశింప చేశారు. 


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నెలనెలా తెలుగు వెన్నెల సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన మాట్లాడుతూ.. కార్యక్రామనికి విచ్చేసిన అతిథి పేర్ల ప్రభాకర్‌ను సభకు పరిచయం చేశారు. అనంతరం ఆయనను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాడు-నేడు’ అంశం మీద తెలుగు సినీ రంగానికి చెందిన అలనాటి ఆణిముత్యాలను గుర్తు చేసుకున్నారు. తర్వాత డా.ఊరుమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ‘కోమల సాహితీ వల్లభ’, ‘గీతపద్యావిధాత’ డా. కోడూరి ప్రభాకర రెడ్డిని సభకు పరిచయం చేసి, వేదికపైకి ఆహ్వానించారు. ‘శ్రీనాధుడి చాటువులు’ అంశం మీద డా. కోడూరి ప్రభాకర్ రెడ్డి చక్కగా ప్రసంగించారు. కవి సార్వభౌముడు శ్రీనాధుడి జీవితంలో నుంచి వారి చాటువులను గుర్తు చేశారు. ప్రముఖ సాహితీ విశ్లేషకులు లెనిన్ వేముల.. ఒకే ఓక్క అచ్చ తెలుగు అవధాని డా. శ్యామలానందప్రసాద్‌ను సభికులకు పరిచయం చేశారు. ‘తెలుగు సాహిత్యంలో హాస్యం’ అనే అంశంపై శ్యామలానంద ప్రసాద్ అద్భుతంగా ప్రసగించి సభికులను ఆకట్టుకున్నారు. 



ఆధునిక సహజ పండితులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి నెల నెలా నిర్వహించిన ‘మన తెలుగు సిరిసంపదలు’ కార్యక్రమంలో భాగంగా పొడుపు కథల‌తో కూడిన పద్యాలు ప్రశ్నలుగా సంధించి సాహితీ ప్రియులను ఆలోచింప చేశారు. వారి నుంచి సరైన సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు. సాహితీ ప్రయులైన చంద్రహాస్ మద్దకూరి సభకు డా. కోమలరాణి‌ని పరిచయం చేశారు. గుంటూరుకి చెందిన నరసింహ దీక్షత శర్మ సామితీ సేవలను సభకు ఆమె వివరించారు. 


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పార్నపల్లి.. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గం, పాలక మండలి తరఫున ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. సభకు వచ్చేసిన వారందరికీ విందు భోజనం అందించిన రెస్టారెంట్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. డా. ప్రసాద్ తోటకూర విశిష్ట అతిథి డా. కోడూరి ప్రభాకర్ రెడ్డిని శాలువతో సత్కరించి, జ్జాపిక‌ను అందించారు. ఉమామహేష్ పార్నపల్లి మరో విశిష్ట అతిథి ప్రభాకర్ పేర్లను సత్కరించగా.. శ్యామలానందప్రసాద్ పాలపర్తిని డా. సత్యం ఉపద్రష్ట సన్మానించి జ్జాపిక అందించారు. ఒకే ఒక్క అచ్చ తెలుగు అవధాని సాహిత్య సంపదను కొనియాడుతూ ‘అవధాన కళాయశస్వి’ బిరుదుతో గౌరవించారుు.  


Updated Date - 2022-07-27T23:59:32+05:30 IST