Bathukamma: చికాగోలో టీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-10-02T15:16:54+05:30 IST

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను అక్టోబర్ 1వ తేదీన పవిత్రమైన నవరాత్రి సీజన్‌లో చికాగోలోని పాలటైన్, ఫాల్కన్ పార్క్ రిక్రియేషన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించింది.

Bathukamma: చికాగోలో టీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

చికాగో: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) ఈ సంవత్సరం బతుకమ్మ పండుగను అక్టోబర్ 1వ తేదీన పవిత్రమైన నవరాత్రి సీజన్‌లో చికాగోలోని పాలటైన్, ఫాల్కన్ పార్క్ రిక్రియేషన్ సెంటర్‌లో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలకు చెందిన దాదాపు 500 మందికి పైగా తెలుగువారు పాల్గొన్నారు. పూల పండుగ బతుకమ్మను తెలుగు మహిళలు సంప్రదాయబద్ధంగా, ధూంధాంగా నిర్వహించారు. మంచి ఆరోగ్యం, సంతోషం కోసం బతుకమ్మను స్తుతిస్తూ జానపద పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఈ వేడుకలకు వచ్చిన వారందరూ ఎంతో సంతోషంగా గడిపారు. కార్యక్రమం ముగింపులో బతుకమ్మ ఆశీర్వాదం పొందారు. 


అలాగే ఈ ఉత్సవాల సందర్భంగా రుచికరమైన తెలుగింటి భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ బతుకమ్మ పండుగను టీటీఏ ప్రెసిడెంట్  హేమచంద్ర వీరపల్లి ఘనంగా నిర్వహించారు. టీటీఏ(TTA) సభ్యులు రామకృష్ణ కొర్రపోలు, హేమంత్ పప్పు, శ్రీనాధ్ వాసిరెడ్డి, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయపూడి, మధు ఆరంబాకం ఆయనకు సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సోమలత, శృతి, శిల్ప, రమేష్, రామాదేవి, రాధికా, సందీప్, లీల ప్రసాద్, నవీన్ కుమార్ ఎంతగానో శ్రమించారు. అలాగే తానా (TANA), IAGC సభ్యులు కూడా పాల్గొన్నారు.Read more