TANTEX: నెలనెలా తెలుగు వెన్నెల 176వ సాహితీ సదస్సు

ABN , First Publish Date - 2022-03-23T14:47:11+05:30 IST

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 176వ నెలనెలా తెలుగు వెన్నెల, 48 వటెక్సస్ తెలుగు సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది.

TANTEX: నెలనెలా తెలుగు వెన్నెల 176వ సాహితీ సదస్సు

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో 176వ సాహితీ సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 19న జరిగిన 176వ నెలనెలా తెలుగు వెన్నెల, 48 వటెక్సస్ తెలుగు సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీనివాసులు బసాబత్తిన అంతర్జాలంలో సభకు విచ్చేసిన సాహితీవేత్తలకు నమస్కారం తెలిపారు. ప్రముఖ రచయిత శ్రీసత్యం మందపాటి కూడా అందరికీ నమస్కారాలు తెలుపుతూ కార్యక్రమం గురించి వివరించారు. చిన్నారులు సాహితీ, సింధూర ప్రయాగ రంగ దాస గారి "రాముడుద్భవించాడు" కీర్తన పాడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో మొదటి భాగం అయిన సాహిత్య సమాచారంలో డా.వై.కృష్ణ కుమారి భారతంలో క్రీడలు అంశం మీద ప్రసంగించి అందరికీ కొత్త విషయాలు తెలియజేసారు. 


శాన్ఆంటోనియోకి చెందిన ప్రసాద్ తుర్లపాటి "అన్నమయ్య, రామదాసు, త్యాగయ్య: సంకీర్తన పోకడలు-పరిశీలన" మీద ప్రసంగించి వారి కీర్తనలను గుర్తు చేసారు. నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో భాగంగా “మన తెలుగు సిరి సంపదలు”ధారావాహికలో ఊరిమిండి నరసింహారెడ్డి తెలుగుభాషలోని పొడుపుకథలు, జాతీయాలలో ప్రశ్నలు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. డాలస్కి చెందిన లెనిన్ వేముల వసంతకాలంపై రాయబడిన కవితలు, గేయాలపై చక్కగా ప్రసంగించారు. ఆస్టిన్‌కు చెందిన ఇర్షాద్ స్టాండ్ అప్ కామెడీ చేసి అందరినీ నవ్వులలో ముంచెత్తారు. హరి మద్దూరి "యుగ యుగాల కథ" అంశం మీద ప్రసంగించి సైన్సులో విషయాలను పురాణాలతో పోలుస్తూ అందరినీ ఆశ్చర్యంలో పడేసారు.


కార్యక్రమం రెండో భాగంలో ప్రముఖ రచయితలు సత్యం మందపాటి, రాముడొక్కా, ఫణిడొక్కా పుస్తక ఆవిష్కరణలు జరిగాయి. హూస్టన్‌కు చెందిన సాయి రాచకొండ, దీప్తి పెండ్యాల, శ్రీనివాస్ పెండ్యాల, సత్యం.. మందపాటి గారి "సత్యాన్వేషణ" పుస్తకానికి ఆవిష్కరించారు. తరువాత రాముడొక్కా గారి "పద్య సఫారి", ఫణిడొక్కా గారి పలుకు కచేరి కలిపిని "మా ఆఫ్రికా యాత్ర" పుస్తక ఆవిష్కరణ చేశారు. ఈ పుస్తకానికి ఆచార్య ఎన్.సీ.ఎచ్. చక్రవర్తి, సత్యం మందపాటి ఆవిష్కర్తలుగా వ్యవహరించారు. చివరగా మాసానికో మహనీయుడు శీర్షిక కింద అరుణజ్యోతి ఈనెలలో గుర్తుచేసుకోవలసిన ప్రముఖ రచయితల గురించి వివరించారు. ఉత్తర టెక్సాస్ సంఘం అధ్యక్షులు ఉమామహేష్ పర్నపల్లి ప్రార్థనా గీతం పాడిన సాహితీ, సింధూరతో పాటు కార్యక్రమంలో పాల్గొన్నసాహిత్య అభిమానులకు ఉత్తర టెక్సాస్ సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



Updated Date - 2022-03-23T14:47:11+05:30 IST