TANA: 'తానా' బాలోత్సవం-2022

ABN , First Publish Date - 2022-09-08T14:14:40+05:30 IST

బాల బాలికల్లో సృజనాత్మకను వెలికి తీసి వారిలో లలిత కళల పట్ల ఆసక్తిని, అనురక్తిని పెంచే వేదికగా తానా బాలోత్సవాన్ని-2022ను నిర్వహించింది.

TANA: 'తానా' బాలోత్సవం-2022

ఇంటర్నెట్ డెస్క్: బాల బాలికల్లో సృజనాత్మకను వెలికి తీసి వారిలో లలిత కళల పట్ల ఆసక్తిని, అనురక్తిని పెంచే వేదికగా తానా బాలోత్సవాన్ని-2022ను నిర్వహించింది. తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు నేతృత్వంలో శిరీష తునుగుంట్ల సారథ్యంలో బాలోత్సవం చైర్మన్ దీపిక సమ్మెటతో పాటు బాలోత్సవం బృందం(బాలోత్సవం కో-చైర్ శ్రీనివాస్ ఉప్పు, సాయి బొల్లినేని, నాగ పచ్చమర్తి,  వెంకట్ మీసాల, దిలీప్ ముసునూరు, హనుమత చెరుకూరి, సునీల్ కొల్లురు, వంశీ వాసిరెడ్డి, సుమంత్ రామిశెట్టి, రాజా కసుకుర్తి, రామ్ తోట, శ్రీనివాస్ ఉయ్యూరు, సిరి కొంపల్లి, పద్మ భోగవల్లి, శ్రీనివాస్ గోగినేని, కిశోర్ యర్లగడ్డ, ప్రదీప్ గడ్డం, మాధురి ఏలూరి, పద్మజ బేవర, రత్న గుమ్మడి, సతీష్ కొమ్మన, సౌజన్య పొట్టి, లక్ష్మీ కందిమల్ల, శిరీష కొంపల్లి, రవి వడ్లముడి) నెల రోజుల పాటు కష్ట పడి ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించారు.


ఈ ఉత్సవాల్లో పిల్లల్ని వారి వయసును బట్టి 5 సంవత్సరాల నుండి 10 సం. వరకు, 11 సం. నుండి 16 సం. వరకు రెండు గ్రూపులుగా విభజించారు. సంగీతం( శాస్త్రీయ మరియు సినిమా), నృత్యం (శాస్త్రీయ మరియు సినిమా ), పద్య పఠనం, పబ్లిక్ స్పీచ్, ఫ్యాన్సీ డ్రెస్, రూబెక్ క్యూబ్ మొదలైన అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో అమెరికాలోని వందలాది బాల బాలికలు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.


ఆగస్టు 27న ఈ ఉత్సవాల ముగింపు సభ అంజయ్య చౌదరి లావు అధ్యక్షతన, శిరీష తూనుగుంట్ల వ్యాఖ్యాన ఆధ్వర్యంలో జరిగింది. ఈ సభకు సుప్రసిద్ధ సినీ కధా రచయిత, రాజ్య సభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా హాజరై తానా చేస్తున్న బహు ముఖమైన కార్యక్రమాల్ని తెలుసుకుని అభినందించారు. పిల్లల్లోని సృజనాత్మక శక్తులు వెలికి వచ్చే వేదిక ఈ బాలోత్సవమని, తెలుగు భాషను, సంస్కృతిని కాపాడేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. అంతకుముందు అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా సాంస్కృతిక, క్రీడా, సామాజిక, ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో చేస్తున్న సేవల గురించి వివరించారు. ఆ తర్వాత ప్రసంగించిన తానా పూర్వ అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి బాలోత్సవం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ తన కుటుంబం తరుపున భద్రాచలంలో నిర్వహించిన ఉత్సవాల్ని గుర్తు చేసుకున్నారు. 


అనంతరం గౌరవ అతిథులుగా విచ్చేసిన ప్రఖ్యాత కూచిపూడి నర్తకీమణి స్వాతీ సోమనాధ్, సుప్రసిద్ధ జర్నలిస్ట్, యాంకర్ స్వప్న ప్రసంగిచారు. స్వప్న పాడిన అన్నమయ్య కీర్తన అందరినీ అలరించింది. ఆ తర్వాత భిన్నమైన రీతిలో చేసిన బహుమతుల ప్రకటన అందర్నీ ఆకట్టుకుంది. పద్మభూషణ్ రాజా రాధా రెడ్డి, శాస్త్రియ, సినీ నృత్యాల్లో విజేతల్ని, సినీ నేపథ్య గాయక దంపతులు పూర్ణిమ గోపిక, మల్లికార్జున రావులు పాటల పోటీ ఫలితాల్ని ప్రకటించారు. సుప్రసిద్ధ కవి, నటులు డాక్టర్ మీగడ రామ లింగస్వామి పద్యపఠనం ఫలితాల్ని ప్రకటించారు.


వివిధ పోటీల విజేతలు:

సంగీతం( శాస్త్రీయ మరియు సినిమా ): ఇషాన్వి శ్రీనివాస్, వేదార్క వసంత్, ఆధ్యాత్మిక సనిపిని, ప్రణతి భట్, స్నికిత లక్కిరెడ్డి, సాయి శరణ్య, అలేఖ్య యెర్నేని, శ్రీరామ కప్పగంతు, నికిత కొండపి, ఆద్య కేసన

నృత్యం(శాస్త్రీయ మరియు సినిమా ): జాహ్నవి బండారు, నవ్య ముంగర, రితిక కొల్లూరు, శాంతి వర్షిణి జలేం, కీర్తిక తుమ్మల, శ్రియ కేతినీడి, అన్విక వీరమాచనేని, శాన్వి ప్రియా తన్నీరు, యుక్తా దుబ్బిరెడ్డి, తనిష్క్ భీమనపల్లి, శ్రీవల్లబు ప్పప్పిడి

పద్య పఠనం: కీర్తన పర్వతనేని, ధర్షిత అక్షయ పదాల, శ్రీహిత్ మాజేటి, సహస్ర దరిసిపూడి, అలేఖ్య యెర్నేని, శ్రీనికా జైని

ఫ్యాన్సీ డ్రెస్: శ్రీహిత్ మాజేటి, ధృతి మల్లు, సోహన్ కార్తీక్ పడాల

రూబెక్ క్యూబ్: శ్రీహిత్ మాజేటి, అక్షత్ భాగీ, అద్వైత్ అత్తూర్, శ్రీకర్ మాజేటి, పృథ్వీ నాగళ్ల, సుబాంగ్ అడపాలా


చివరగా బాలోత్సవ చైర్ దీపిక సమ్మెట వందన సమర్పనతో కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా వ్యవహరించిన Movers.com విద్య గారపాటి, eSigns.com జయ తాళ్లూరికి బాలోత్సవం బృందం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.         







Read more