భారత మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం!

ABN , First Publish Date - 2022-12-09T17:43:21+05:30 IST

అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియాకు చెందిన 54ఏళ్ల సుశ్మితా శుక్లా న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మొదటి ఉపాధ్యక్షరాలు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియామకం..

భారత మహిళకు అమెరికాలో అరుదైన గౌరవం!

ఎన్నారై డెస్క్: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియాకు చెందిన 54ఏళ్ల సుశ్మితా శుక్లా న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మొదటి ఉపాధ్యక్షరాలు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నియామకం అయ్యారు. ఫెడరల్ బ్యాంకు ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది మార్చిలో న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రెండవ అత్యున్నత పదవిని ఆమె అలంకరించనున్నారు. ఇన్సూరెన్స్ రంగంలో అపార అనుభవం గడించిన ఆమె.. యూనివర్సిటీ ఆఫ్ ముంబై నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టాను పొందారు. అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీలో ఆమె ఎంబీఏ పూర్తి చేశారు.

Updated Date - 2022-12-09T17:49:24+05:30 IST