NRI: తండ్రికి తెలియకుండా యూఎస్ నుంచి కొడుకును తెచ్చుకున్న తల్లి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

ABN , First Publish Date - 2022-07-30T16:21:14+05:30 IST

కర్నాటకు చెందిన ఎన్నారై దంపతుల (NRI Couple) విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme court) కీలక తీర్పు ఇచ్చింది.

NRI: తండ్రికి తెలియకుండా యూఎస్ నుంచి కొడుకును తెచ్చుకున్న తల్లి.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

న్యూఢిల్లీ: కర్నాటకు చెందిన ఎన్నారై దంపతుల (NRI Couple) విషయంలో శుక్రవారం సుప్రీంకోర్టు (Supreme court) కీలక తీర్పు ఇచ్చింది. అమెరికా (America)లో ఉండే ఈ దంపతులకు 11 ఏళ్ల ఓ కుమారుడు ఉన్నాడు. వివాహమైన పదేళ్ల నుంచి అగ్రరాజ్యంలోనే ఉంటున్నారు. అయితే, దంపతుల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగా భర్తకు తెలియకుండా భార్య 2020 మార్చిలో స్వదేశానికి వచ్చేసింది. వచ్చేటప్పుడు కుమారుడిని కూడా తన వెంట తెచ్చుకుంది. దీంతో తండ్రి తన కొడుకు తనకు కావాలని కోర్టుకెక్కాడు. మొదట కర్నాటక హైకోర్టు (Highcourt)లో ఈ దంపతుల కేసు విచారణకు వచ్చింది. ఇక్కడ న్యాయస్థానం 11 ఏళ్ల బాలుడి (11 Year Old Boy)ని తల్లి వద్దే ఉంచాలని తీర్పునిచ్చింది. దాంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తండ్రి సుప్రీంకోర్టుకు వెళ్లాడు. 


అత్యున్నత న్యాయస్థానంలో శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఇరువురు వాదనలు విన్న జస్టిస్ ఏఎం ఖాన్విలర్, సీటీ రవికుమార్ న్యాయవాదుల బెంచ్ బాలుడిని యూఎస్‌లో ఉన్న తండ్రికే అప్పగించాలని తీర్పునిచ్చింది. ఎందుకంటే బాబు అక్కడే పుట్టాడు. పైగా 10 ఏళ్లు అమెరికాలోనే ఉన్నాడు. అక్కడి పాస్‌పోర్టు కూడా ఉంది. పేరెంట్స్‌కు గ్రీన్ కార్డులు ఉన్నాయి. కనుక పిల్లాడికి సాధారణంగానే యూఎస్ పౌరసత్వం వర్తిస్తుందని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది. మరోవైపు అమెరికా కోర్టు కూడా బాలుడిని తండ్రి వద్దే ఉంచాలని, వెంటనే ఇండియా నుంచి అక్కడి రప్పించాలంటూ తీర్పు ఇచ్చిందని సమాచారం. 


కోర్టులో పేర్కొన వివరాల ప్రకారం.. కర్నాట రాజధాని బెంగళూరు(Banglore)కు చెందిన ఈ ఎన్నారై దంపతులకు 2008లో వివాహమైంది. పెళ్లి తర్వాత ఈ జంట అగ్రరాజ్యానికి వెళ్లిపోయింది. అక్కడే వీరికి బాబు పుట్టాడు. పదేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు. దంపతులిద్దరికీ అమెరికా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్‌కార్డులు (Green Cards) ఉన్నాయి. అయితే, 2020లో దంపతుల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా భార్య పదేళ్ల తన కుమారుడిని తీసుకుని మార్చిలో స్వదేశానికి వచ్చేసింది. దాంతో భర్త మొదట అక్కడి కోర్టులో తన కొడుకు తన వద్దే ఉండాలని భార్యపై కేసు పెట్టాడు. అక్కడి న్యాయస్థానం భర్తకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. 


అనంతరం స్వదేశంలో ఉన్న తల్లి తన బిడ్డ తన వద్దే ఉండాలని కర్నాటక (Karnataka) హైకోర్టులో కేసు వేసింది. దాంతో ఆమెకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అమెరికాలో ఉంటున్న భర్త సుప్రీంకోర్టుకెళ్లాడు. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది. ఇరువురు వాదనలు విన్న ఏఎం ఖాన్విలర్, సీటీ రవికుమార్ న్యాయవాదుల బెంచ్ బాలుడిని తండ్రికే అప్పగించాలని తీర్పునిచ్చింది. అతడు పుట్టిపెరిగింది అమెరికా (America)లోనే కనుక సాధారణంగానే బాలుడికి అగ్రరాజ్యం పౌరసత్వమే వర్తిస్తుందని తన తీర్పులో పేర్కొంది.  

Updated Date - 2022-07-30T16:21:14+05:30 IST