Burj Khalifa: మరోసారి బుర్జ్ ఖలీఫాపై మెరిసిన షారూఖ్ ఖాన్

ABN , First Publish Date - 2022-09-29T19:00:48+05:30 IST

గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై మెరిసిన కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తాజాగా మరోసారి సందడి చేశారు.

Burj Khalifa: మరోసారి బుర్జ్ ఖలీఫాపై మెరిసిన షారూఖ్ ఖాన్

అబుదాబి: గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై మెరిసిన కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) తాజాగా మరోసారి సందడి చేశారు. యూఏఈలోని ప్రముఖ హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన బుర్జీల్ హోల్డింగ్స్ (Burjeel Holdings) ఇంటిగ్రేడ్ బ్రాండ్ తరఫున రూపొందించిన ప్రచార వీడియోను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన స్ర్కీన్‌పై రాత్రి 8.20 గంటలకు ప్రచార వీడియోను ప్రదర్శించారు. ఇందులో నటుడు షారూఖ్ హేల్త్‌కేర్ గ్రూపు సక్సెస్ స్టోరీని వివరించారు. ఈ సందర్భంగా బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ డా. షంషీర్ వాయలీల్ మాట్లాడుతూ, తామే గౌరవించే విలువలను ప్రతిబింబించే ప్రచారాన్ని సూపర్ స్టార్ (Superstar) షారూఖ్ ఖాన్‌తో ప్రారంభించడం మాకు గర్వంగా ఉందన్నారు. షారూఖ్ ప్రచారం చేస్తున్న బుర్జీల్ హోల్డింగ్స్ గ్రూపు యూఏఈ (UAE), ఒమన్‌ (Oman)లో బుర్జీల్, మీడియర్, ఎల్ఎల్‌హెచ్, లైఫ్‌కేర్, తాజ్మీల్ బ్రాండ్‌ల క్రింద 39 ఆస్పత్రులు, మెడికల్ సెంటర్‌లను కలిగి ఉంది. 

Read more