UK new cabinet: బ్రిటన్ కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు

ABN , First Publish Date - 2022-09-08T13:00:39+05:30 IST

బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ బుధవారం కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించారు. కొత్త క్యాబినెట్‌లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకొన్నారు.

UK new cabinet: బ్రిటన్ కొత్త కేబినెట్‌లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు చోటు

ట్రస్‌ మంత్రివర్గంలో బ్రావెర్మెన్‌, అలోక్‌ శర్మ

లండన్‌, సెప్టెంబరు 7: బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌ బుధవారం కొత్త మంత్రివర్గాన్ని ప్రకటించారు. కొత్త క్యాబినెట్‌లో ఇద్దరు భారత సంతతి వ్యక్తులు చోటు దక్కించుకొన్నారు. తమిళ, గోవా మూలాలున్న సుయెల్లా బ్రావెర్మెన్‌(47)ను లిజ్‌ ట్రస్‌ విదేశాంగ మంత్రిగా నియమించారు. బ్రావెర్మెన్‌ బోరిస్‌ ప్రభుత్వంలో అటార్నీ జనరల్‌గా పనిచేశారు. భారత సంతతికే చెందిన ప్రీతి పటేల్‌ ఇప్పటివరకు బ్రిటన్‌ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. బోరిస్‌ ప్రభుత్వంలో కాప్‌ 26 అధ్యక్షుడిగా(పర్యావరణ పరిరక్షణ మంత్రి) పనిచేసిన అలోక్‌ శర్మ(55)ను అదే పదవిలో కొనసాగించాలని ట్రస్‌ నిర్ణయం తీసుకొన్నారు. అలోక్‌ శర్మ ఆగ్రాలో జన్మించారు. బోరిస్‌ క్యాబినెట్‌లో చాలా మందిని ట్రస్‌ తప్పించారు.

Updated Date - 2022-09-08T13:00:39+05:30 IST