8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. వచ్చిన డబ్బులతో UK లో చదువుకునేందుకు పక్కా ప్లాన్.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-10-06T21:22:42+05:30 IST

అతడికి ప్రస్తుతం 19ఏళ్లు. ఇంటర్ పూర్తి చేసి, కొన్ని రోజులపాటు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌లోని ఓ కా

8 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి.. వచ్చిన డబ్బులతో UK లో చదువుకునేందుకు పక్కా ప్లాన్.. చివరకు ఏం జరిగిందంటే..

ఎన్నారై డెస్క్: అతడికి ప్రస్తుతం 19ఏళ్లు. ఇంటర్ పూర్తి చేసి, కొన్ని రోజులపాటు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యాడు. ఆ తర్వాత మనసు మార్చుకున్నాడు. విదేశాల్లో ఉన్నత చదువులు చదివితే భవిష్యత్తు బాగుంటుంది అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌లోని ఓ కాలేజీని సంప్రదించాడు. తర్వాత సుమారు రూ.8లక్షల డబ్బును ఫీజుగా చెల్లించాడు. అనంతరం మరికొంత డబ్బు కావాల్సి ఉండటంతో భారీ స్కెచ్ వేశాడు. 8ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేశాడు. అయితే.. చివరికి అతడి పరిస్థితి ఏమైందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని సికార్ ప్రాంతానికి చెందిన ఆనంద్‌పాల్ ఉన్నత విద్య చదవడానికి ఇంగ్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే రెండు నెలల క్రితం రూ.8లక్షలు అప్పు చేసి ఆ మొత్తాన్ని ఇంగ్లాండ్‌లోని ఓ కాలేజీలో ఫీజుగా చెల్లించాడు. ఇంగ్లాండ్ వెళ్లేందుకు మరింత డబ్బు కావాల్సి ఉండటం.. గతంలో అప్పు చేసిన చోట భారీగా వడ్డీ పెరిగిపోతుండటంతో అతడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇంటర్ పూర్తి చేసిన కళాశాల యజమాని ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశాడు. అతడి ఆర్థిక పరిస్థితి బాగుందని గ్రహించిన ఆనంద్‌పాల్.. తన స్నేహితులతో కలిసి ప్లాన్ రెడీ చేశాడు. ఇందులో భాగంగానే కళాశాల యజమాని కుమారుడిని కిడ్నాప్ చేసేందుకు రెక్కీ నిర్వహించాడు. అనంతరం యజమాని 8ఏళ్ల కుమారుడిని కిడ్నాప్ చేసి సుమారు రూ.15లక్షల వరకు డిమాండ్ చేశాడు. అయితే.. బాబు తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో.. ఆనంద్‌పాల్ కథ అడ్డం తిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేసి ఆనంద్‌పాల్, అతడి స్నేహితుడిని అరెస్ట్ చేశారు. 8ఏళ్ల బాబును తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు.. విదేశాల్లో చదివేందుకు డబ్బులు అవసరమై 8ఏళ్ల బాబును ఆనంద్‌పాల్ కిడ్నాప్ చేసినట్టు చెప్పారు. ఈ విషయాన్ని నిందుతుడే ఒప్పుకున్నట్టు వెల్లడించారు. 


Read more