Indian students: వింత నిర్ణయం.. UKకు వెళ్లిన తర్వాత భారతీయ విద్యార్థులు ఎందుకు చదువు మానేస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-12-05T13:42:36+05:30 IST

ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి భారత విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు స్టూడెంట్ వీసాలపై వెళ్లిపోతున్నారు. అయితే.. చదువు కోవడానికి స్టూడెంట్ వీసాపై యూకే వెళ్తున్న చాలా మంది భారత విద్యార్థులు.. అక్కడికి వెళ్లిన తర్వాత..

Indian students: వింత నిర్ణయం.. UKకు వెళ్లిన తర్వాత భారతీయ విద్యార్థులు ఎందుకు చదువు మానేస్తున్నారంటే..

ఎన్నారై డెస్క్: ఈ మధ్య కాలంలో విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి భారత విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాలకు స్టూడెంట్ వీసాలపై వెళ్లిపోతున్నారు. అయితే.. చదువు కోవడానికి స్టూడెంట్ వీసాపై యూకే వెళ్తున్న చాలా మంది భారత విద్యార్థులు.. అక్కడికి వెళ్లిన తర్వాత రూటు మార్చుతున్నారు. అంత దూరం వెళ్లి.. ఆ తర్వాత చదువును అర్ధాంతరంగా మధ్యలోనే ఆపేస్తున్నారు. అంతేకాదు వాళ్ల వీసా కేటగిరిని కూడా మర్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో మన పిల్లలు చేస్తున్న పని కరెక్టేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు? అనే పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉన్నత విద్య కోసం యూకే వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో చాలా మంది అక్కడికి వెళ్లిన తర్వాత తమ స్టూడెంట్ వీసాను కాస్తా స్కిల్డ్ వర్కర్ వీసాగా కన్వర్ట్ చేసుకుంటున్నారట. తమ‌కు ఉన్న స్కిల్స్‌ను బట్టి.. ఆయా అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారట. ఈ విషయాన్ని భారత్‌లోని గుర్తింపు పొందిన ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. బ్రిటన్‌లో హెల్త్‌కేర్, హోమ్‌కేర్‌తోపాటు పలు రంగాలను నిపుణుల కొరత వేధిస్తోందట. ఈ క్రమంలో అప్పటికే ఆయా రంగాల్లో భారత్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు.. ఉన్నత చదువల కోసం అని బ్రిటన్ వెళ్లి ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారట. ఈ క్రమంలోనే స్టూడెంట్ వీసాలను స్కిల్డ్ వర్కర్స్ వీసాలుగా కన్వర్ట్ చేసుకుంటున్నారట. దాదాపు 10 శాతం మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికే తమ వీసా కేటగిరిని మార్చేసుకున్నారట.

ఇలా చేయడం లీగలేనా..

ఇదిలా ఉంటే.. కొందరు భారతీయులు మాత్రం అక్కడ వర్క్ చేయలనే ఉద్దేశంతోనే మొదటగా స్టూడెంట్ వీసాపై బ్రిటన్ వెళ్లి, ఆ తర్వాత దాన్ని స్కిల్డ్ వర్కర్స్ వీసాగా మార్చుకుంటున్నారట. డైరెక్ట్‌గా స్కిల్డ్ వర్కర్స్ వీసా పొందడం కొంచెం కఠినతరమైనందు వల్ల.. షార్ట్‌కట్ విధానంలో మొదటగా స్టూడెంట్ వీసా పొంది అక్కడికి వెళ్లిన తర్వాత దాన్నే స్కిల్డ్ వర్కర్స్ వీసాగా కన్వర్ట్ చేసుకుంటున్నారట. ఈ క్రమంలోనే భారత విద్యార్థులు ఇలా చేయడం ఎంత వరకూ కరెక్ట్ అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే.. స్టూడెంట్ వీసాను స్కిల్డ్ వర్కర్స్ వీసాగా కన్వర్ట్ చేసుకోవడం నేరమేమీ కాదట. నిబంధనల ప్రకారమే భారతీయులు తమ వీసాను మార్చుకుంటున్నారని ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ప్రతినిధులు చెబుతున్నారు.

Updated Date - 2022-12-05T14:23:38+05:30 IST