'వాల్మీకి రామాయణం.. విజేత లక్షణాలు' సదస్సు జయప్రదం
ABN , First Publish Date - 2022-06-07T18:50:27+05:30 IST
స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం, శ్రీ దశరథరామ ఫౌండేషన్, శ్రీ పద్మావతిమహిళా డిగ్రీ & పీజీ కళాశాల తెలుగు విభాగం, తిరుపతి ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన 'వాల్మీకి రామాయణము.. విజేత లక్షణాలు' అంశంపై జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు విజయవంతమైంది.

స్వయంభు శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం, శ్రీ దశరథరామ ఫౌండేషన్, శ్రీ పద్మావతిమహిళా డిగ్రీ & పీజీ కళాశాల తెలుగు విభాగం, తిరుపతి ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన 'వాల్మీకి రామాయణము.. విజేత లక్షణాలు' అంశంపై జరిగిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు విజయవంతమైంది. కాణిపాకంలోని ఆస్థానమండపంలో జరిగిన ఈ సదస్సుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తొలుత అతిధులకు, ఆహ్వానితులకు సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, J-యోగా ఫౌండర్ జ్యోతీశ్వర్ రెడ్డి, డా. వి కృష్ణవేణి స్వాగతం పలికారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, విశిష్ట అతిధిగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సురేష్ బాబు, ఆత్మీయ అతిధిగా తిరుమల తిరుపతి దేవస్థానం విద్యాశాఖాధికారి సి. గోవిందరాజన్ హాజరయ్యారు. శ్రీ పద్మావతిమహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. మహాదేవమ్మ సభాధ్యక్షత వహించారు. ప్రత్యేక అతిధిగా కస్తూరి (ఏఈఓ), కాణిపాకం హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఇండొనేషియాకు చెందిన రామాయణ హరినాథ రెడ్డి 'వాల్మీకి రామాయణం...విజేత లక్షణాల'పై ఉపన్యసించారు. సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి, మేడూరి మాధవకృష్ణ శర్మ(అమెరికా), ఎస్.జి. విజయకుమార్(ఒమన్), సుప్రజ(అమెరికా), వందన(అమెరికా) కూడా ఈ కార్యక్రమంలో అతిథులుగా హాజరయ్యారు. ప్రశ్న- జవాబుల కార్యక్రమంలో డా. శ్రీలత, డా. స్వర్ణలత, గాయత్రి, డా. అరుణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షులు, J-యోగా ఫౌండర్ జ్యోతీశ్వర్ రెడ్డిని సన్మానించారు.
