NRI: కెనడాలో దారుణం.. పెట్రోల్ బంక్ వద్ద భారత సంతతి యువతిని..

ABN , First Publish Date - 2022-12-05T20:17:22+05:30 IST

కెనడాలో దారుణం జరిగింది. మిస్సిసాగాలోని ఓ పెట్రోల్ బంక్ వద్ద 21 ఏళ్ల సిక్కు యువతిని గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా కాల్చి చంపాడు.

NRI: కెనడాలో దారుణం..  పెట్రోల్ బంక్ వద్ద భారత సంతతి యువతిని..

ఎన్నారై డెస్క్: కెనడాలో దారుణం జరిగింది. మిస్సిసాగాలోని(Mississauga) ఓ పెట్రోల్ బంక్ వద్ద 21 ఏళ్ల సిక్కు యువతిని(Sikh woman) గుర్తుతెలియని వ్యక్తి దారుణంగా కాల్చి(Shooting) చంపాడు. ఆమెను ఏదో కారణంతోనే చంపి ఉండొచ్చని(Targeted) పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలిని పవన్‌ప్రీత్ సింగ్ కోర్‌గా(Pawapreet Kaur) గుర్తించారు. ఆమె బ్రాప్టన్(Brampton) ప్రాంతంలో నివసించేది. డిసెంబర్ 3న రాత్రి వేళ బ్రిటానియా రోడ్‌లోని(Britannia Road) పెట్రో కెనడా గ్యాస్ స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది.

కాల్పుల సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. నిందితుడు నల్లని దుస్తులు ధరించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే..ఘటనా స్థలంలో వారికి ఎటువంటి ఆయుధం లభించలేదు. కాల్పులు జరిపాక అతడు అక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్లిపోయాడని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసుల విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. పథకం ప్రకారమే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గత వారం కెనడాలో భారత సంతతికి చెందిన 18 ఏళ్ల మహాప్రీత్ సేఠీపై స్కూల్లోని పార్కింగ్ స్థలంలో కత్తిదాడి జరడంతో అతడు మృతి చెందాడు. అంతకుమునుపు జరిగిన మరో ఘటనలో.. భారతీయ వ్యాపారికి చెందిన షాపులో దొంగలు పడి దోచుకుపోయారు.

Updated Date - 2022-12-05T20:20:04+05:30 IST