UAE-India flights: భారత ప్రవాసులు ఈ నెలాఖరు వరకు ఆగితే బెటర్.. సగం ధరకే స్వదేశానికి రావొచ్చు!

ABN , First Publish Date - 2022-07-10T18:56:52+05:30 IST

ప్రస్తుతం యూఏఈ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమాన టికెట్ల ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే.

UAE-India flights: భారత ప్రవాసులు ఈ నెలాఖరు వరకు ఆగితే బెటర్.. సగం ధరకే స్వదేశానికి రావొచ్చు!

దుబాయ్: ప్రస్తుతం యూఏఈ నుంచి భారత్‌లోని వివిధ గమ్యస్థానాలకు విమాన టికెట్ల ధరలు మండిపోతున్న విషయం తెలిసిందే. సమ్మర్ సెలవులు కావడంతో స్వదేశానికి రావాలనుకుంటున్న భారత ప్రవాసులకు అధిక ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దాంతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. అలాంటి వారికి ఇది గుడ్‌న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నెలఖారు వరకు ప్రస్తుతం ఉన్న విమాన టికెట్ల ధరలు సగానికి సగం దిగి రానున్నాయి. ప్రస్తుతం విమాన టికెట్లు అందిస్తున్న బుకింగ్ ఏజెన్సీలు చెబుతున్న మాట ఇది. అంతేగాక ఆయా ఏజెన్సీల వెబ్‌సైట్లలో ప్రస్తుతం ఉన్న విమాన చార్జీలు.. ఈ నెలఖారుకు అవే చార్జీలు ఎంత ఉండునున్నాయి అనే వివరాలను పొందుపరిచాయి. 


ఆ సమాచారం ప్రకారం... ప్రస్తుతం అబుదాబి నుంచి బెంగళూరుకు విమాన టికెట్ ధరలు 2వేల నుంచి 4వేల దిర్హమ్స్(రూ.43వేల నుంచి రూ. 86వేలు) గా ఉంటే.. ఈ నెలఖారుకు ఇవే ధరలు 600-700 దిర్హమ్స్‌కు(రూ.13000 నుంచి 15వేలు) దిగి రానున్నాయి. అలాగే దుబాయ్ నుంచి ఢిల్లీ, ముంబై నగరాలకు ఇప్పుడు విమాన చార్జీలు(వన్‌వే) 2000-3000 దిర్హమ్స్(రూ.43వేల నుంచి రూ. 64వేలు)గా ఉంది. అదే ఈ నెల చివరికి ఈ ధరలు కేవలం 400-500 దిర్హమ్స్(రూ.8,600 నుంచి రూ. 10,700)గా ఉండనున్నాయి. ఇక కొచ్చికి 1000 నుంచి 2000 దిర్హమ్స్(రూ. 21వేల నుంచి 43వేలు ) పలుకుతున్న ధరలు 400-500 దిర్హమ్స్(రూ.8,600 నుంచి రూ. 10,700) దిగి రానున్నాయి. అందుకే భారత ప్రవాసులు మరో 15 నుంచి 20 రోజులు ఆగితే సగం ధరకే స్వదేశానికి రావొచ్చని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్న మాట.   

Updated Date - 2022-07-10T18:56:52+05:30 IST