Google‌లో జాబ్ చేయాలనే పిచ్చి.. వరుసగా 39సార్లు రిజెక్ట్.. అయినా అతడు వెనక్కి తగ్గలేదు.. చివరికి ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-07-28T01:22:13+05:30 IST

ప్రతి ఒక్కరికీ ఏదో ఒక జీవిత ఆశయం ఉంటుంది. బాగా డబ్బులు సంపాదించాలని అని కొందరు అనుకుంటే.. జీవితాన్ని వీలైనంత ఎంజాయ్ చేయాలని మరికొందరు అనుకుంటారు. అలాగే ఓ యువకుడికి Googleలో జాబ్ చేయాలనేది జీవిత లక్ష్యం. ఈ క్ర

Google‌లో జాబ్ చేయాలనే పిచ్చి.. వరుసగా 39సార్లు రిజెక్ట్.. అయినా అతడు వెనక్కి తగ్గలేదు.. చివరికి ఏమైందంటే..

ఎన్నారై డెస్క్: ప్రతి ఒక్కరికీ ఏదో ఒక జీవిత ఆశయం ఉంటుంది. బాగా డబ్బులు సంపాదించాలని అని కొందరు అనుకుంటే.. జీవితాన్ని వీలైనంత ఎంజాయ్ చేయాలని మరికొందరు అనుకుంటారు. అలాగే ఓ యువకుడికి Googleలో జాబ్ చేయాలనేది జీవిత లక్ష్యం. ఈ క్రమంలోనే వరుసపెట్టి జాబ్ అప్టికేషన్‌లు పంపించాడు. 39 సార్లు అతడికి నిరాశ ఎదురైంది. అయినా అతడు పట్టు విడవలేదు. 40వ సారి కూడా దరఖాస్తు పంపాడు. ఈ నేపథ్యంలో చివరికి ఏమైందనే పూర్తి వివరాల్లోకి వెళితే..



ఆ యువకుడి పేరు టైలెర్ కొహెన్ (Tyler Cohen). అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో( San Francisco)‌లో నివసిస్తున్నాడు. Googleలో జాబ్ సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఏళ్ల తరబడి 39 సార్లు Job Application పెట్టాడు. అన్నిసార్లు అతడికి నిరాశే ఎదురైంది. మరొకరైతే అవమానంగా భావించి.. ఆ ప్రయత్నాన్ని మానుకునేవారేమో. కానీ టైలెర్ కొహెన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. గూగుల్‌లో జాబ్ చేయాలనే పిచ్చితో.. 40వ సారి కూడా అప్లికేషన్ పంపించాడు. ఈ క్రమంలో అతడి కల నెలవేరింది. టెక్ దిగ్గజం గూగుల్ అతడి‌ అప్లికేషన్‌‌కు ఆమోదం తెలిపింది. దీంతో అతడి సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో గూగుల్‌కు పంపిన అప్లికేషన్ జాబితాకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను Social Mediaలో పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్ ప్రకారం.. 2019లో టైలెర్ కొహెన్ ఆరుసార్లు జాబ్ అప్లికేషన్లు పంపాడు. 2020లో 17 సార్లు, 2021లో 12 సార్లు దరఖాస్తు చేశాడు. 2022లో కూడా నాలుగు సార్లు నిరాశే ఎదురైనా మరోసారి అప్లై చేశాడు. ఈ క్రమంలో అతడికి ఉద్యోగం లభించింది. కాగా.. ఈ పోస్టును చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 


Updated Date - 2022-07-28T01:22:13+05:30 IST