Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్ పోయిందా.. అయితే ఈ పని చేయండి!

ABN , First Publish Date - 2022-09-26T18:30:45+05:30 IST

రెసిడెన్సీ పర్మిట్‌ల విషయంలో సౌదీ అరేబియా(Saudi Arabia) కీలక వ్యాఖ్యలు చేసింది. సౌదీలో నివాసం ఉంటున్న ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌లను కోల్పోతే.. జరిమానాగా 1000 సౌదీ రియాల్స్ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా మరో

Saudi Arabia: రెసిడెన్సీ పర్మిట్ పోయిందా.. అయితే ఈ పని చేయండి!

ఎన్నారై డెస్క్: రెసిడెన్సీ పర్మిట్‌ల విషయంలో సౌదీ అరేబియా(Saudi Arabia) కీలక వ్యాఖ్యలు చేసింది. సౌదీలో నివాసం ఉంటున్న ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌లను కోల్పోతే.. జరిమానాగా 1000 సౌదీ రియాల్స్ కట్టాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాకుండా మరోసారి రెసిడెన్సీ పర్మిట్‌ను పొందేందుకు చెల్లించాల్సిన ఫీజు వివరాలను తెలియజేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భారత్ సహా ఇతర దేశాల నుంచి కూడా నిత్యం వేలాది మంది.. ఉపాధి, ఉద్యోగాల కోసం సౌదీ అరేబియా వెళ్తుంటారు. ఇలా వెళ్లే వారికి అక్కడి ప్రభుత్వం రెసిడెన్సీ పర్మిట్లు ఇచ్చి.. సౌదీలో నివసించడానికి అనుమతి ఇస్తుంది. అయితే.. ఇంతటి ముఖ్యమైన రెసిడెన్సీ పర్మిట్లను తెలిసి తెలిసి ఏ ప్రవాసుడూ పోగొట్టుకోడు. కానీ దురదృష్టవశాత్తు ఒక వేళ రెసిడెన్సీ పర్మిట్‌(residence permit)ను కోల్పోతే.. తిరిగి రెసిడెన్సీ పర్మిట్‌ను పొందాల్సి ఉంటుంది. తాజాగా సంబంధించిన వివరాలను సౌదీ జనరల్ డైరెక్టర్ ఆఫ్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెల్లడించింది. 


రెసిడెన్సీ పర్మిట్ గడువు ఏడాది లేదా అంతకంటే తక్కవ ఉండగా.. ఎవరైనా ప్రవాసుడు దాన్ని కోల్పోతే.. 500 సౌదీ రియాల్స్‌(సుమారు రూ.10వేలు)ను ఫీజుగా చెల్లించి మిగిలిన కాలానికి రెసిడెన్సీ పర్మిషన్ తీసుకోవచ్చని ప్రకటనలో తెలిపింది. ఈ ఫీజును సదద్ సిస్టమ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. అయితే ఇలా మిగిలిన కాలానికి రెసిడెన్సీ పర్మిట్ పొందాలంటే.. యజమాని నుంచి పొందిన లెటర్‌తోపాటు రెసిడెన్సీ పర్మిట్‌ను పోగొట్టుకున్న ప్రాంతం(Lost Residence Permit in Saudi) తదితర వివరాలను అప్లికేషన్‌ సమయంలో అందించాలని తెలిపింది. పోగొట్టుకున్న రెసిడెన్సీ పర్మిట్‌కు సంబంధించిన జిరాక్స్ అందుబాటులో ఉంటే దాన్ని కూడా పొందుపర్చొచ్చని చెప్పింది. అంతేకాకుండా రెసిడెన్సీ పర్మిట్ కోల్పోయిన ప్రవాసుడు.. జరిమానా కింద 1000 సౌదీ రియాల్స్(దాదాపు రూ.20వేలు) చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అంటే ఫీజు, జరిమానా కలిపి మొత్తం 1500 సౌదీ రియాల్స్ చెల్లించాలన్నమాట. 


Updated Date - 2022-09-26T18:30:45+05:30 IST