బ్రెజిల్‌లో అంబరాన్నంటిన సాంబా పరేడ్ సంరంభం..!

ABN , First Publish Date - 2022-04-25T05:12:29+05:30 IST

బ్రెజిల్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నలిచే సాంబా పరేడ్ సంరంభం అక్కడి ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తోంది. ఆశ్చర్యం కలిగించే రంగు రంగుల డిజైన్లతో కూడిన వస్త్రాలను ధరించిన సాంబ కళకారులు రాజధాని రియోలోని సాంబాడ్రోమ్‌కు కొత్త కళ తీసుకొచ్చారు.

బ్రెజిల్‌లో అంబరాన్నంటిన సాంబా పరేడ్ సంరంభం..!

ఎన్నారై డెస్క్: బ్రెజిల్ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నలిచే సాంబా పరేడ్ సంరంభం అక్కడి ప్రేక్షకులకు ఉర్రూతలూగిస్తోంది. ఆశ్చర్యం కలిగించే రంగు రంగుల డిజైన్లతో కూడిన వస్త్రాలను ధరించిన సాంబ కళకారులు రాజధాని రియోలోని సాంబాడ్రోమ్‌కు కొత్త కళ తీసుకొచ్చారు. కరోనా సంక్షోభం కారణంగా..రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సాంబా వేడుకలు కరోనా మిగిల్చిన చేదు గాయాలను మర్చిపోయేలా చేస్తున్నాయి. డ్రమ్ముల లయబద్ధమైన శబ్దాల నడుము సాంబా కళాకారులు డ్యాన్సులు చేస్తూ రియో నగరానికే కొత్త వన్నె తెస్తున్నారు. ఇంతకాలం కరోనా ఆంక్షల కారణంగా ఉపాధికోల్పోయిన కళాకారుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ‘‘ఈ రెండేళ్లూ చాలా ఇబ్బంది పెట్టేశాయి. ఇన్నాళ్లు మళ్లీ మా జీవితాల్లో సంతోషం చిగురించింది’’ అని ఓ కళాకారుడు సంబరపడిపోతూ చెప్పాడు. 1980 నుంచి సాంబాడ్రోమ్‌లో ఈ పరేడ్లు జరుగుతూ వస్తున్నాయి. ఇక కరోనా సమయంలో ఎంతో మంది నిరాశ్రయులు ఇక్కడే తల దాచుకున్నారు. అంతేకాకుండా.. ప్రభుత్వం చేపట్టిన టీకా కార్యక్రమానికి కూడా సాంబాడ్రోమ్ ఓ వేదిక అయ్యింది. 


రియోతో పాటూ సావోపావలోలో కూడా ఈ కార్నివాల్ వేడుకలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో జరగాల్సిన ఈ వేడులకను ఆయా నగరాల మేయర్లు కరోనా కట్టడి కోసమని ఓ రెండు నెలలు వాయిదా వేయడంతో ఈ మారు ఏప్రిల్‌లో ఇవి ప్రారంభమయ్యాయి. అయితే..పరేడ్‌ను చూసేందుకు వచ్చే వారందరూ తాము టీకా తీసుకున్నట్టు తెలిపే ధృవీకరణ పత్రాలు చూపించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. కానీ..నిబంధనలు పాటించని వారు కూడా సులువుగా టిక్కెట్లు దొరకబుచ్చుకుని స్టేడియంలోకి ప్రవేశిస్తున్నారని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. 


Read more