ఆస్ట్రేలియాలో PV Narasimha Rao విగ్రహం: మహేష్‌ బిగాల

ABN , First Publish Date - 2022-05-18T13:40:47+05:30 IST

ఆస్ట్రేలియా ప్రధాన నగరమైన సిడ్నీ పరిధిలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌ మేయర్‌ మాథ్యూ బ్లాక్మోరేతో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు మహేష్‌ బిగాల భేటీ అయ్యారు.

ఆస్ట్రేలియాలో PV Narasimha Rao విగ్రహం: మహేష్‌ బిగాల

స్ట్రాత్‌ఫీల్డ్‌ మేయర్‌ సుముఖం: మహేష్‌ బిగాల

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియా ప్రధాన నగరమైన సిడ్నీ పరిధిలోని స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌ మేయర్‌ మాథ్యూ బ్లాక్మోరేతో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు మహేష్‌ బిగాల భేటీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహ ఏర్పాటు గురించి బ్లాక్మోరేతో చర్చించినట్టు తెలిపారు. తమ అభ్యర్థనల పట్ల మేయర్‌ సుముఖత వ్యక్తం చేశారని వెల్లడించారు. స్ర్టాత్‌ఫీల్డ్‌లో భారతీయులు 16% వరకు ఉన్నారని, అందులోనూ తెలుగు ప్రజానీకం అధికంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణకు చెందిన సంధ్యారెడ్డి మొదటిసారి స్ర్టాత్‌ఫీల్డ్‌ కౌన్సిల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారని చెప్పారు. భవిష్యత్తులో వాణిజ్యం, సాంస్కృతిక రంగాల్లో తెలంగాణతో కలిసి పని చేయడానికి బ్లాక్మోరే ఆసక్తి కనబరిచారని వెల్లడించారు. ఈ భేటీలో స్ట్రాత్‌ఫీల్డ్‌ కౌన్సిలర్‌ సంధ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more