విద్యార్థులు 2 నిమిషాలు లేటుగా వచ్చారంటూ పోలీసులకు ప్రొఫెసర్ ఫిర్యాదు.. !

ABN , First Publish Date - 2022-04-11T02:21:51+05:30 IST

రాత్రి లేట్‌గా నిద్రపోయి మరుసటి రోజు లేటుగా లేవడం మామూలే. ఈ క్రమంలో స్కూల్‌‌కో లేదా కాలేజీకో లేట్‌గా వెళ్లడం..టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అంతే కామన్. ఒక్కోసారి క్లాసుకు రావద్దంటూ కూడా వాళ్లు ఆదేశిస్తుంటారు. అయితే.. అమెరికాలోని ఓ యూనివర్శిటీలోని ఓ ప్రొఫెసర్.. ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విద్యార్థులు 2 నిమిషాలు లేటుగా వచ్చారంటూ పోలీసులకు ప్రొఫెసర్ ఫిర్యాదు.. !

ఎన్నారై డెస్క్: రాత్రి లేట్‌గా నిద్రపోయి మరుసటి రోజు లేటుగా లేవడం మామూలే. ఈ క్రమంలో స్కూల్‌‌కో లేదా కాలేజీకో లేట్‌గా వెళ్లడం..టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా అంతే కామన్. ఒక్కోసారి క్లాసుకు రావద్దంటూ కూడా వాళ్లు ఆదేశిస్తుంటారు. అయితే.. అమెరికాలోని ఓ యూనివర్శిటీలోని ఓ ప్రొఫెసర్..  ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. 


జార్జియా స్టేట్ యూనివర్శిటీలో ఇటీవల ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ ప్రొఫెసర్..లేటుగా వచ్చిన ఇద్దరు విద్యార్థులను  క్లాసులోకి అనుమతించలేదు. కానీ.. స్టూడెంట్లు  మాత్రం ఎదురు తిరిగారు. ‘ఇక్కడ చదువుకోడానికి మేం డబ్బులు కట్టాం’ అంటూ ఘాటుగా జావాబిచ్చారు. దీంతో.. ఆ ప్రొఫెసర్‌కు చిర్రెత్తుకొచ్చి క్లాసులోంచి విసవిసా నడుచుకుంటూ వెళ్లిపోయింది. కొద్ది క్షణాల తరువాత.. ఇద్దరు సాయుధులైన పోలీసులను వెంటపెట్టుకుని రావడంతో ఆ ఇద్దరు విద్యార్థులు బేర్మన్నారు. తమకు ఏం జరగబోతోందో అనే ఆందోళనతో ఏడవడం మొదలెట్టారు. వాస్తవానికి ఆ ప్రొఫెసర్ నల్లజాతి మహిళ. విద్యార్థులు కూడా వాళ్లే! ‘‘ ఇద్దరు శ్వేతజాతికి చెందిన పోలీసులు ఆయుధాలతో రావడంతో మేం బెదిరిపోయాం. ఇలాంటి పరిస్థితుల్లో నల్లజాతి వారి గతి ఏమవుతుందో మాకు తెలుసు’’ అంటూ ఆ స్టూడెంట్లు ఇద్దరూ కన్నీరు కార్చారు. ఇదంతా అమెరికాలో వైరల్ అవడంతో ఆ ప్రొఫెసర్‌ క్లాసులకు రావద్దంటూ యూనివర్శిటీ అధికారులు ఆదేశించారు.  

Read more