Work visa: అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. లక్ష వర్కర్‌ వీసాలు ఇస్తామన్న ఎంబసీ

ABN , First Publish Date - 2022-10-02T13:13:25+05:30 IST

హెచ్‌, ఎల్‌ కేటగిరీలో లక్ష వర్కర్‌ వీసాలు ఇవ్వనున్నట్టు అమెరికా దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరికొద్ది వారాల్లోనే స్లాట్ల ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది.

Work visa: అమెరికా వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. లక్ష వర్కర్‌ వీసాలు ఇస్తామన్న ఎంబసీ

హెచ్‌, ఎల్‌ కేటగిరీలో లక్ష వర్కర్‌ వీసాలు!

అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడి

న్యూఢిల్లీ, అక్టోబరు 1: హెచ్‌, ఎల్‌ కేటగిరీలో లక్ష వర్కర్‌ వీసాలు ఇవ్వనున్నట్టు అమెరికా దౌత్య కార్యాలయం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరికొద్ది వారాల్లోనే స్లాట్ల ప్రక్రియను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ మేరకు కౌన్సిరల్‌ వ్యవహారాల శాఖ మినిస్టర్‌ డాన్‌ హెఫ్లిన్‌ చెప్పారు. అమెరికా విసాలకు సంబంధించిన సమస్యలపై శనివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా నేపథ్యంలో వీసాల కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి సిబ్బంది కొరత ప్రధాన కారణమన్నారు. అయితే.. కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తాత్కాలిక సిబ్బందిని నియమించుకుని.. వీసాల ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు తెలిపారు. అదేవిధంగా డ్రాప్‌ బాక్స్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.  

Updated Date - 2022-10-02T13:13:25+05:30 IST