అడిలైడ్, సౌత్ఆస్ట్రేలియాలో NTR శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-05-30T20:51:53+05:30 IST

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి సంవత్సర ప్రారంభ ఉత్సావాలు అడిలైడ్ నగరంలోని ఫ్లిండర్స్ పార్క్ కమ్యూనిటీ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి.

అడిలైడ్, సౌత్ఆస్ట్రేలియాలో NTR శతజయంతి ఉత్సవాలు ప్రారంభం

టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు  శత జయంతి సంవత్సర ప్రారంభ ఉత్సావాలు అడిలైడ్ నగరంలోని  ఫ్లిండర్స్ పార్క్ కమ్యూనిటీ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. సినిమా,  రాజకీయ రంగాలలో అన్నగారి ఘనవిజయాలు, తెలుగు వారికి అయన చేసిన సేవ గుర్తు చేసుకొని సభికులు ఆనందించారు. యావత్ సభా ప్రాంగణం జోహార్ ఎన్టీఆర్ అనే నినాదంతో మారుమ్రోగింది . ఈ సందర్భంగా TDP NRI Cell సౌత్ ఆస్ట్రేలియా విభాగాన్ని లాంఛనంగా ప్రారంభించారు. డా. నవీన్ కుమార్ నేలవల్లి అధ్యక్షులుగా, రవీందర్ రెడ్డి టేకుల ఉపాధ్యక్షులుగా,  స్రవంతి కొండవీటి  కార్యదర్శిగా, సందీప్ పాతూరి అదనపు కార్యదర్శిగా,  చైతన్య పాలిశెట్టి  కోశాధికారిగా ఎన్నికయ్యారు.


కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ప్రభుత్వ దారుణాలు, దిగజారిపోయిన రాష్ట్ర ఆర్థిక, సామాజిక పరిస్థితులపై ఇక్కడి ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేసారు. వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావాలని, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం ఇవ్వగలిగిన నేర్పు, సత్తా చంద్రబాబు నాయుడికే  ఉందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, రెండు రాష్ట్రాల్లో ప్రజలు బాగుండాలని వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. 


ఈ కార్యక్రమానికి ఇండియా నుండి జూమ్ కాల్‌లో టీడీపీ సీనియర్ నాయకులు నన్నపనేని రాజకుమారి, తెనాలి శ్రవణ్ కుమార్,  ఆలపాటి రాజేంద్రప్రసాద్,  గౌతు శిరీష,  మొహమ్మద్ నజీర్, యరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ NRI  సెల్ కన్వీనర్ రాజశేఖర్ ప్రసంగించి తమ శుభాకాంక్షలు తెలియజేసారు. కరుడుగట్టిన ఆర్ధిక నేరస్థుల చేతుల నుండి రాష్ట్రానికి విముక్తి కల్పించడానికి ప్రపంచంలోని ప్రతి తెలుగు వాడు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 


స్థానికంగా ఉండే వందలాది మంది  తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ సభలో ప్రత్యేకంగా ప్రసంగించి సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన  డా. శ్రీధర్ నన్నపనేని,  రమేష్ నల్లపునేని ..సభను విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాసరావు సూర్యదేవర, సుమన్ కుమార్ వసంతం,  సుమంత్ కొమ్మినేని, సుకన్య వేజెళ్ళ  ఇతర యువ కమిటి మెంబెర్స్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.



Updated Date - 2022-05-30T20:51:53+05:30 IST