బ్యాడ్‌లక్.. ఏళ్ల తర్వాత సొంతూరుకు బయల్దేరిన ఎన్నారై.. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా..

ABN , First Publish Date - 2022-09-29T00:49:23+05:30 IST

ఉపాధి, ఉద్యోగం కోసం బ్యాంకాక్ వెళ్లి.. తిరిగి స్వస్థలానికి చేరుకున్న ఓ NRIకి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై కారు కోసం ఎదురు చూస్తుండగా.. కొందరు దుండగులు అతడిని చుట్టుముట్టారు. దగ్గర్లో ఉన్న లాడ్జీకి తీసుకెళ్లారు. గదిలో బంధించి.. దారుణం

బ్యాడ్‌లక్.. ఏళ్ల తర్వాత సొంతూరుకు బయల్దేరిన ఎన్నారై.. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటాడనగా..

ఎన్నారై డెస్క్: ఉపాధి, ఉద్యోగం కోసం బ్యాంకాక్ వెళ్లి.. తిరిగి స్వస్థలానికి చేరుకున్న ఓ NRIకి చేదు అనుభవం ఎదురైంది. రోడ్డుపై కారు కోసం ఎదురు చూస్తుండగా.. కొందరు దుండగులు అతడిని  చుట్టుముట్టారు. దగ్గర్లో ఉన్న లాడ్జీకి తీసుకెళ్లారు. గదిలో బంధించి.. దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


సర్వేష్ యాదవ్ కొన్నేళ్ల క్రితం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ బ్యాంకాక్(Bangkok) వెళ్లాడు. అనంతరం అక్కడ ఓ ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డాడు.  ఈ నేపథ్యంలోనే తాజాగా అతడు ఇండియాకు రావాలని నిర్ణయించుకున్నాడు. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని.. మంగళవారం ఉదయం ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని తన స్వగ్రామమైన మర్మతీయ(Marmatia village)కు వెళ్లేందుకు బస్సెక్కాడు. ఊరి వరకు బస్సు సౌకర్యం లేకపోవడంతో మార్గ మధ్యంలోనే దిగిన అతడు.. గ్రామంలో ఉన్న స్నేహితులకు ఫోన్ చేసి కారు తీసుకురావాలని సూచించాడు. అనంతరం స్నేహితుల కోసం వేచి చూస్తున్న సర్వేష్‌ను రెండు కార్లలో వచ్చిన ఆరుగురు దుండగులు చుట్టుముట్టారు. సర్వేష్‌ను కిడ్నాప్ చేసి.. దగ్గర్లో ఉన్న ఓ లాడ్జీలో బంధించారు. ఆ తర్వాత అతడిని చితకొట్టారు. అంతేకాకుండా అతడి వద్ద ఉన్న రూ.16వేల నగదు.. 12వేల యూఎస్ డాలర్లతోపాటు 75 గ్రాముల బంగారు గొలుసును కూడా ఎత్తుకెళ్లారు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. కాగా.. దుండగులు విడిచిపెట్టిన తర్వాత సర్వేష్ పోలీసులను ఆశ్రయించాడు. దుండగులు వినియోగించిన కారు నెంబర్ల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇది స్థానికంగా చర్చనీయాంశం అయింది. 


Updated Date - 2022-09-29T00:49:23+05:30 IST