UAE new visa rules: యూఏఈలో అమల్లోకి కొత్త వీసా నిబంధనలు.. కొత్త విధానం మరింత సరళతరం

ABN , First Publish Date - 2022-10-04T12:50:27+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) కొత్త వీసా నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. రెసిడెంట్స్‌ సంఖ్యను మరింతగా పెంచేలా కొత్త విధానం ఉంటుందని పేర్కొన్నారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం.. పర్యాటక వీసాకు ‘మల్టిపుల్‌ ఎంట్రీ’ వీసా అవకాశం కల్పించారు. ఐదేళ్ల పరిమితి కలిగిన ఈ వీసా తీసుకున్న విదేశీ పర్యాటకులు 90 రోజుల వరకూ ఆ దేశంలో ఉండవచ్చు.

UAE new visa rules: యూఏఈలో అమల్లోకి కొత్త వీసా నిబంధనలు.. కొత్త విధానం మరింత సరళతరం

దుబాయ్‌, అక్టోబరు 3: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ) కొత్త వీసా నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వచ్చాయి. రెసిడెంట్స్‌ సంఖ్యను మరింతగా పెంచేలా కొత్త విధానం ఉంటుందని పేర్కొన్నారు. సరళీకరించిన నిబంధనల ప్రకారం.. పర్యాటక వీసాకు ‘మల్టిపుల్‌ ఎంట్రీ’ వీసా అవకాశం కల్పించారు. ఐదేళ్ల పరిమితి కలిగిన ఈ వీసా తీసుకున్న విదేశీ పర్యాటకులు 90 రోజుల వరకూ ఆ దేశంలో ఉండవచ్చు. సాధారణ పర్యాటక వీసా కలిగిన వారు 60 రోజులు ఉండవచ్చు. ఐదేళ్ల గ్రీన్‌ రెసిడెన్స్‌ వీసాను ఆ తర్వాత మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. గ్రీన్‌ వీసా ఉన్నవారు తమ మగ బిడ్డలను పాతికేళ్ల వరకూ స్పాన్సర్‌ చేయవచ్చు. గతంలో ఇది 18 ఏళ్లుగా ఉండేది. పెళ్లికాని ఆడబిడ్డలు, దివ్యాంగ బిడ్డల విషయంలో వయోపరిమితి లేదు. ఇక గోల్డెన్‌ వీసా కలిగిన వారికి కూడా కొత్త విధానం అదనపు ప్రయోజనాలను అందించనుంది. అదే విధంగా కూలీలు ఎంతమందికైనా యజమానులు స్పాన్సర్‌ చేసుకోవచ్చు.

Updated Date - 2022-10-04T12:50:27+05:30 IST