New Trend: భారత్‌లోనే కాదు.. అమెరికాలోనూ అదే పరిస్థితి.. పెళ్లిళ్ల విషయంలో అగ్రరాజ్యంలో కొత్త ట్రెండ్..

ABN , First Publish Date - 2022-09-26T19:08:23+05:30 IST

ఇండియాలో పేద తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లి చేయడానికి తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తుంటారు. తిరిగి ఆ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇదే ట్రెండు అగ్రరాజ్యం అమెరికాలో(Ameri

New Trend: భారత్‌లోనే కాదు.. అమెరికాలోనూ అదే పరిస్థితి.. పెళ్లిళ్ల విషయంలో అగ్రరాజ్యంలో కొత్త ట్రెండ్..

ఎన్నారై డెస్క్: ఇండియాలో పేద తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లి చేయడానికి తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తుంటారు. తిరిగి ఆ డబ్బును వాయిదాల పద్ధతిలో చెల్లిస్తూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఇదే ట్రెండు అగ్రరాజ్యం అమెరికాలో(America)నూ మొదలైంది. అయితే ఇక్కడ అమెరికన్ తల్లిదండ్రులకు అప్పులు ఇచ్చేది మాత్రం తెలిసిన వాళ్లో లేక బంధువులో కాదు. కార్పోరేట్ సంస్థలు. అవును మీరు విన్నది నిజమే. ప్రత్యేకంగా పెళ్లిళ్ల కోసమే అమెరికన్ తల్లిదండ్రులకు కొన్ని కార్పోరేట్ సంస్థలు అప్పులు ఇస్తున్నాయి. వాటిని సులభ వాయిదా పద్ధతిలో చెల్లించొచ్చని చెబుతున్నాయి. దీంతో అమెరికాలో ప్రస్తుతం కొత్త ట్రెండ్(New Trend) మొదలైంది. 


ప్రస్తుతం పెళ్లిళ్లు కాస్ట్లీగా మారాయి. వివాహానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా.. సంపన్నులు పెళ్లి వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. అది చూసి, పేద.. మధ్య తరగతి ప్రజలు కూడా అప్పులు చేసి మరీ ఈ శుభాకార్యాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నారు. దీన్నే అమెరికాలోని కొన్ని కార్పోరేట్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక చరిత్రను పరిశీలించి.. పిల్లల పెళ్లిళ్ల కోసం అప్పులు ఇస్తున్నాయి. తర్వాత ఆ మొత్తాన్ని సలుభ వాయిదాల పద్ధతి(Marriages on EMI)లో తిరిగి తీసుకుంటున్నాయి. 



అమెరికాలో తాజాగా జరిగిన ఓ సర్వేలో 15వేల దంపతులు పాల్గొనగా.. చాలా మంది ఈ పద్ధతిని స్వాగతిస్తున్నట్టు తేలింది. అంతేకాదు.. పిల్లల పెళ్లిళ్ల కోసం తల్లిదండ్రులు సగటున రూ.22లక్షలకు సమానమైన అమెరికా డాలర్లను వెచ్చిస్తున్నట్టు సర్వేలో బయటపడింది. పేద ప్రజలు ఈ పద్ధతిని ఓ వరంగా భావిస్తుండగా.. కొందరు ఆర్థిక నిపుణులు మాత్రం పెదవి విరుస్తున్నారు. కేవలం పెళ్లి వేడుక కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడాన్ని తప్పుబడుతున్నారు. ఏ హంగూ ఆర్భాటం లేకుండా పెళ్లి జరిపించి.. పెళ్లికి అయ్యే ఖర్చును కొత్త దంపతుల ఆర్థిక పరిపుష్టి కోసం అందజేస్తే బాగుంటుందని చెబుతున్నారు. 


Updated Date - 2022-09-26T19:08:23+05:30 IST