Devika Bulchandani: మరో అమెరికన్ కార్పొరేట్ సంస్థకు బాస్‌గా భారతీయురాలు..!

ABN , First Publish Date - 2022-09-11T14:57:25+05:30 IST

ఉద్యోగం, ఉపాధి కోసం అగ్రరాజ్యం అమెరికా వెళ్తున్న భారతీయులు అక్కడ తమ ప్రతిభతో ఏకంగా తాము పనిచేసే సంస్థలకు బాస్‌గా మారుతున్నారు. ఈ జాబితాలో తాజాగా మరో భారత సంతతి మహిళ దేవిక బుల్‌చందానీ చేరారు. డబ్ల్యూపీపీ యాజమాన్యంలోని గ్లోబల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఒగిల్వీ కొత్త సీఈవోగా ఆమె నియమితులయ్యారు.

Devika Bulchandani: మరో అమెరికన్ కార్పొరేట్ సంస్థకు బాస్‌గా భారతీయురాలు..!

వాషింగ్టన్: ఉద్యోగం, ఉపాధి కోసం అగ్రరాజ్యం అమెరికా (America) వెళ్తున్న భారతీయులు అక్కడ తమ ప్రతిభతో ఏకంగా తాము పనిచేసే సంస్థలకు బాస్‌గా మారుతున్నారు. ప్రస్తుతం అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని చాలా కార్పొరేట్ సంస్థలకు మనోళ్లే సీఈఓలు, చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో సుందర్ పిచాయ్ (గూగుల్), సత్య నాదేళ్ల (మైక్రోసాఫ్ట్), పరాగ్ అగర్వాల్ (ట్విట్టర్), శంతను నారాయణ్ (అడోబ్), అరవింద్ కృష్ణ (ఐబీఎం), లీనా నాయర్ (చానల్), అజయ్ బంగా, మనీష్ శర్మ వంటి భారతీయ ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. వీరందరూ అమెరికన్ కంపెనీలకు సీఈవోలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబితాలో తాజాగా మరో భారత సంతతి మహిళ దేవిక బుల్‌చందానీ (Devika Bulchandani) చేరారు. డబ్ల్యూపీపీ యాజమాన్యంలోని గ్లోబల్ అడ్వర్టైజింగ్ కంపెనీ ఒగిల్వీ (Ogilvy) కొత్త సీఈవోగా ఆమె నియమితులయ్యారు.


2020లో ఒగిల్వీలో చేరిన ఆమె నార్త్ అమెరికా గ్లోబల్ ప్రెసిడెంట్, సీఈవోగా విధులు నిర్వర్తించారు. ఒగిల్వీలో చేరడానికి ముందు ఆమె దాదాపు 26 ఏళ్ల పాటు మెక్‌కాన్ సంస్థలో నార్త్ అమెరికా ప్రెసిడెంట్ సహా వివిధ హోదాల్లో పనిచేశారు. అలాగే మాస్టర్ కార్డ్ కోసం 'ప్రైస్‌లెస్' (Priceless), 'ట్రూ నేమ్' (True Name) ప్రచారంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఇక దేవిక ప్రారంభించిన ‘ఫియర్‌లెస్ గర్ల్’ (Fearless Girl) అనే స్త్రీ సమానత్వం ప్రచార కార్యక్రమానికి కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన క్యాంపెయిన్‌లలో ఒకటిగా నిలిచింది. కాగా, పంజాబ్‌ రాష్ట్రంలోని అమృత్‌సర్‌లో జన్మించిన ఆమె, యూనివర్శిటీ ఆఫ్ దక్షిణ కాలిఫోర్నియా నుంచి మాస్టర్స్ చేశారు. 

Updated Date - 2022-09-11T14:57:25+05:30 IST