GCC jobs: ఈ ఏడాది గల్ఫ్‌కు భారీగా పెరిగిన భారత కార్మికుల వలసలు

ABN , First Publish Date - 2022-08-23T14:05:31+05:30 IST

మహమ్మారి కరోనా కారణంగా రెండేళ్లుగా జీసీసీ (GCC) దేశాలకు భారత కార్మికుల వలసలు భారీగా పడిపోయాయి.

GCC jobs: ఈ ఏడాది గల్ఫ్‌కు భారీగా పెరిగిన భారత కార్మికుల వలసలు

ఎన్నారై డెస్క్: మహమ్మారి కరోనా కారణంగా రెండేళ్లుగా జీసీసీ (GCC) దేశాలకు భారత కార్మికుల వలసలు భారీగా పడిపోయాయి. అయితే, ఈ ఏడాది రివర్స్ మిగ్రేషన్(Reverse migration)‌లో భాగంగా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాలకు భారత కార్మికుల వలసలు భారీగా పెరిగాయి. 2022 మొదటి ఏడు నెలల్లో ఏకంగా 50శాతం మేర కార్మికుల వలసలు పెరిగినట్లు ఇటీవల లోక్‌సభలో (Lok Sabha) విదేశాంగ శాఖ సహాయ మంత్రి (Minister of State for External Affairs) వీ మురళీధరన్ వెల్లడించారు. 2022 జనవరి నుంచి జూలై చివరి వరకు 1,89,206 వలస అనుమతులు (Emigration clearances) జారీ చేసినట్లు మంత్రి తెలిపారు. 


ఇక 2021లో మొదటి ఏడు నెలల్లో ఈ సంఖ్య 1,32,763గా ఉందని చెప్పారు. కాగా, మహమ్మారి కారణంగా గల్ఫ్‌కు వలస వెళ్ళడానికి ప్రవాసులకు 2020 చెత్త సంవత్సరంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ఆ సంవత్సరంలో కేవలం 94,145 ఎమిగ్రేషన్ క్లియరెన్స్‌లు మాత్రమే జారీ చేయబడ్డాయన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన క్లియరెన్స్‌లలో ఇది సగానికి సమానం అని చెప్పుకొచ్చారు. జీసీసీ దేశాలతో సహా 18 దేశాలలో ఉపాధి కోసం నిపుణులు, సెమీ-స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులతో పాటు నర్సు ఉద్యోగాలకు భారత ప్రభుత్వం నుండి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం అవుతుంది. 

Updated Date - 2022-08-23T14:05:31+05:30 IST