NATS ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కూచిపూడి నృత్యోత్సవం

ABN , First Publish Date - 2022-07-13T02:13:38+05:30 IST

అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు కళలను కూడా ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా నాట్స్ ప్లోరిడాలో కూచిపూడి నృత్సోత్సవాన్ని నిర్వహించింది.

NATS ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో కూచిపూడి నృత్యోత్సవం

తెలుగు కళా వైభవాన్ని చాటిన కళాకారులు

ఫ్లోరిడా(జూలై 12): అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్.. తెలుగు కళలను కూడా ప్రోత్సాహిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా నాట్స్ ప్లోరిడాలో కూచిపూడి నృత్యోత్సవాన్ని నిర్వహించింది. హిందు టెంపుల్ ఆఫ్ ఫ్లోరిడాలో నిర్వహించిన ఈ కూచిపూడి నృత్యోత్సవానికి విశేష స్పందన లభించింది. కూచిపూడికి పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్ నుంచి శివ శ్రీ నృత్య కళానికేతన్ బృందం కూచిపూడి వైభవాన్ని ప్రవాస భారతీయుల ముందు ప్రదర్శించింది. అట్లాంటా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాతో కలిసి నాట్స్ నిర్వహించిన ఈ నృత్యోత్సవానికి టెంపా పరిధిలోని దాదాపు 300 మంది తెలుగువారు హాజరై తమ కళాభిమానాన్ని చాటుకున్నారు. భారతీయ కళలను, కళకారులను ప్రోత్సహించి వారికి ఆర్థికంగా అండగా నిలిచే ఉద్దేశంతో ఈ నృత్యోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన దాదాపు 8 వేల డాలర్లను కళకారులకు అందించేలా చాలా మంది దాతలు ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీకాంత్ రఘుపాత్రుని దిశా నిర్దేశంలో కూచిపూడి కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలతో అందరిని ఆకట్టుకున్నారు. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు మదన్ కుమార్ గిల్డియాల్, మినీ నాయర్‌లు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. భారతీయ కళల ప్రాముఖ్యతను వివరించారు.


కూచిపూడి కళా ప్రదర్శనలో భాగంగా గణేశస్తుతి, వందేమాతరం, నందకధార, శివోహం, దశావతార రూపిణి, కదిరి నృసింహుడు, శ్రీనివాస కళ్యాణం తదితర ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన మాధురి గుడ్ల నాట్స్ నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  నాట్స్ ఛైర్ వుమెన్ అరుణ గంటి, నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, నాట్స్ బోర్డు సభ్యులు డాక్టర్ శేఖరం కొత్త, నాట్స్ బోర్డ్ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్లు శ్రీనివాస్ మల్లాది, రాజేష్ నెట్టెంలు ఈ కార్యక్రమానికి తమ వంతు మద్దతు అందించారు.


ఈ కార్యక్రమానికి ప్రధాన స్సానర్లుగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోషియేషన్స్ సభ్యులు డాక్టర్ కిరణ్, పల్లవి పటేల్‌తో పాటు డాక్టర్ శేఖరం,మాధవి కొత్త, డాక్టర్ రఘు జువ్వాడి వ్యవహారించారు. ఇంకా వీరితో పాటు నాట్స్ నాయకులు రంజిత్ చాగంటి, శ్రీని గొండి, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) భాను ధూళిపాళ్ల, నేషనల్ కోఆర్డినేటర్ ప్రోగ్రామ్స్ రాజేష్ కాండ్రు, జాయింట్ ట్రెజరర్ సుదీర్ మిక్కిలినేని, టెంపాబే సమన్వయకర్త ప్రసాద్ అరికట్ల, జాయింట్ కోఆర్డినేటర్ సురేశ్ బొజ్జా, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ కృష్ణ మేడిచెర్ల, నాట్స్ కోర్ టీమ్ కమిటీ నుంచి శ్రీనివాస్ అచ్చి రెడ్డి, సుమంత్ రామినేని, విజయ్ కట్టా, భాస్కర్ సోమచి, బిందు బండ, మాధవి యార్లగడ్డ, మధు తాతినేని, హేమ బిక్కసాని, మనోహర్ బిక్కసాని, గాంధీ నిడదవోలు, సంజయ్ కొండ, తదితరులు ఈ నృత్యోత్సవం నిర్వహణకు సహకారం అందించారు. నాట్స్ వాలంటీర్లు ఎంతో ఉత్సాహంగా తమ విధులు నిర్వహించి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి తోడ్పాడ్డారు.


           ఫొటో గ్యాలరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Read more