తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్

ABN , First Publish Date - 2022-09-25T23:55:52+05:30 IST

తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) (TCSS) కార్యవర్గం.. సొసైటీ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాన్ని ఈ నెల 25న స్థానిక లిటిల్ ఇండియాలోని ద్వారకా రెస్టారెంట్‌లో నిర్వహించింది.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మీట్ & గ్రీట్

తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) (TCSS) కార్యవర్గం.. సొసైటీ సభ్యులతో ఆత్మీయ విందు సమావేశాన్ని ఈ నెల 25న స్థానిక లిటిల్ ఇండియాలోని ద్వారకా రెస్టారెంట్‌లో నిర్వహించింది. సొసైటీ ఆహ్వనం మేరకు సుమారు 50-60 మంది TCSS జీవిత కాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


సొసైటి సభ్యులు మాట్లాడుతూ.. ఆహ్వానం మన్నించి సమావేశంలో పాల్గొన్నందుకు వచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఎన్నో విలువైన సలహాలు ఇచ్చారు. ప్రతి ఒక్క సభ్యుడి సలహాలు TCSS అభివృద్ధి ఎంతో ఉపయోగకరమైనవని, వాటన్నింటిని అమలు చేయడానికి తమ కార్యవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తామన్నారు. సింగపూర్‌లో ఉంటున్న తెలంగాణ వాసులందరూ ఒక్క తాటిపై ఉండి కష్టసుఖాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే బతుకమ్మ సంబురాలకు సంబంధించిన కరపత్రిక, ప్రోమోను సభ్యుల సమక్షంలో విడుదల చేశారు. ఈసారి సింగపూర్ బతుకమ్మ వేడుకలను ప్రతి సంవత్సరం మాదిరిగా స్థానిక సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 1వ తేదీన జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సారి విడుదల చేసిన ప్రోమో ఎంతో ప్రత్యేకమైనదని చెప్పారు. పూర్తిగా తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు ప్రత్యేకంగా రాసి పాడించారు. ఈ పాటను రచించి సాహిత్యం అందజేసిన కాసర్ల శ్రీనివాస రావును సభ్యులు అందరు ఎంతో అభినందించారు. ఈ గీతాన్ని ఆలపించిన శ్రావ్య అత్తిలి ఎంతో శ్రావ్యంగా పాడిందని కొనియాడారు.


ఈ సమావేశంలో అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు, కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్ కుమార్, రోజా రమణి, నంగునూరి వెంకట రమణ, కార్యవర్గ సభ్యులు గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, పెరుకు శివ రామ్ ప్రసాద్, కాసర్ల శ్రీనివాస్, శ్రీధర్ కొల్లూరి, భాస్కర్ నడికట్ల, శివ ప్రసాద్ ఆవుల, రవి కృష్ణ విజాపూర్, కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ సభ్యులందరితో పాటూ సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న దాతలకు, ప్రతి ఒక్కరికి  పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. వీరితో పాటు ఇతర సభ్యులు ఎంతో మంది ముందుకు వచ్చి సహాయ సహకారం అందజేయడానికి ముందుకు రావడం సంతోషకరమన్నారు. 

Read more