Maya Bazar: బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన 'మాయా బ‌జార్‌-2022'

ABN , First Publish Date - 2022-05-18T16:54:00+05:30 IST

బే ఏరియాలో నిర్వ‌హించిన 'మాయా బ‌జార్‌-2022' అనే కార్యక్రమం ఎన్నారైలను ప‌ర‌వ‌శింప‌జేసింది.

Maya Bazar: బే ఏరియాను ప‌ర‌వ‌శింపజేసిన 'మాయా బ‌జార్‌-2022'

ఇంటర్నెట్ డెస్క్: బే ఏరియాలో నిర్వ‌హించిన 'మాయా బ‌జార్‌-2022' అనే కార్యక్రమం ఎన్నారైలను ప‌ర‌వ‌శింప‌జేసింది. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఈ ప్రత్యేక ఉత్సవం అంద‌రినీ మంత్ర‌ ముగ్ధుల‌ను చేసింది. 10వేల మందికి పైగా NRI లు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని సేద‌దీరారు. మాయా బజార్ రిఫ్రెష్‌గా, మనోహరంగా ఉందని ఎన్నారైలు పులకరించిపోయారు. దృశ్యపరంగా అద్భుతమైంద‌ని, పూర్తిగా ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్నారు. బే ఏరియా మొత్తం స్వచ్ఛమైన ఆహ్లాద‌క‌ర సంగీతంతో మార్మోగింది. సిటీ ఆఫ్ శాన్ రామన్ ఈవెంట్ పార్టనర్‌, బోలీ 92.3 FM ద్వారా సహ-స్పాన్సర్‌గా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌కు గ్రాండ్ స్పాన్సర్ సంజీవ్ గుప్తా CPA, రియల్టర్ నాగరాజ్ అన్నయ్యలు వ్య‌వ‌హ‌రించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని రైట్ బైట్ డెంటల్ సమర్పించారు. సిల్వర్ స్పాన్సర్ రాయ్ చెట్టి (ఫార్మర్స్ ఇన్సూరెన్స్), ఇతర స్పాన్సర్‌లుగా ICICI బ్యాంక్, ఆజాద్ ఫైనాన్షియల్స్, మాన్‌ప్రెన్యూర్ ఉన్నాయి. మీడియా పార్టనర్‌గా నమస్తే ఆంధ్ర వ్యవహరించింది.


ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 7 గంటల వరకు సాగింది. ఛోటా భీమ్, చుట్కీ వంటి వేష‌ధారులు జనంతో కలిసిపోయి, పిల్లలు, పెద్దలను అల‌రించారు. పిల్లల కోసం అనేక కార్నివాల్ గేమ్‌లు, స్లయిడ్‌లు నిర్వ‌హించారు. జంగిల్ బుక్(జిఫ్ఫీ పెంపుడు జంతువులు), డైనోసార్ పెట్టింగ్ జూ, జంప్ హౌస్‌లు పిల్లలతో రన్‌అవే వంటివి హిట్‌గా నిలిచాయి. మాయా బజార్ ఎక్స్‌ప్రెస్ వంటివి చిన్నారులకు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. మాయాబజార్ ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి భారతీయ సాంస్కృతిక, కళారూపాలను ప్రదర్శించడం, ప్రచారం చేయడం. పగటిపూట నిర్వ‌హించిన‌ సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కూచిపూడి, భరత నాట్యం, కథక్ శాస్త్రీయ నృత్యాలు(పిల్లలు, పెద్దలు), ఫుట్ వాద్యం, టాలీవుడ్ నృత్యాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. BATA కరోకే బృందంలోని గాయకులు సూపర్ హిట్ పాటలను అందించారు. దీనికి తోడు స్టేజ్-2లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి.


ఇక‌ ఆహారం విష‌యానికి వ‌స్తే.. మిర్చ్ మసాలా - ఫుడ్ ఫెస్టివల్ విశిష్టమైన ప్రెజెంటేషన్‌తో వివిధ రుచికరమైన వంటకాలను ఇక్క‌డ అందించారు. నిజానికి వేస‌వి వ‌స్తే.. షాపింగ్ చేయాల‌ని ఉవ్విళ్లూరుతారు. దీనికి మాయాబజార్ వేదిక‌గా మారింది. అన్నీ ఒకే చోట ఏర్పాటు చేశారు. 65 మంది విక్రేతలు ఈవెంట్ స్పాన్సర్‌లు, దుస్తులు, నగలు,  మెహందీ, రియల్ ఎస్టేట్, పాఠశాలలు, IT శిక్షణ, ఆరోగ్య సేవలు, సంగీత పాఠశాలలు, పాటశాల బూత్‌లను ప్రదర్శించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) బోన్ మ్యారో డ్రైవ్ నిర్వహించింది.


AIA బృందం కాన్సుల్ జనరల్ Dr.T.V. నాగేంద్ర ప్రసాద్‌ను సత్కరించింది. అసెంబ్లీ సభ్యుడు రెబెక్కా బాయర్ కహన్, శాన్ రామన్ మేయర్ డేవిడ్ హడ్సన్, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వెరోస్, కౌన్సిల్ మెంబర్ సబీనా జాఫర్, డబ్లిన్ సిటీ వైస్ మేయర్ జీన్ జోసీ, కౌన్సిల్ సభ్యుడు మైఖేల్ మెక్‌కోరిస్టన్, మౌంటైన్ హౌస్ ప్రి హారీ డి.ధిల్లాన్, ట్రేసీ సిటీ మేయర్ ప్రోటెమ్ వెరోనికా వర్గాస్, ఎరిక్ స్వాల్వెల్ కార్యాలయం నుండి జిల్లా డైరెక్టర్, కాంట్రాకో సత్కరించింది. స్టా కమ్యూనిటీ కళాశాల బోర్డు అధ్యక్షుడు ఆండీ లి. సమాజం కోసం ఇంత ఆహ్లాదకరమైన వేసవి ఉత్సవాలను నిర్వహించడం పట్ల ప్రముఖులు AIA ని అభినందించారు. AIA బృందం.. ఆశాజ్యోతి, స్పందన, శంకర ఐ ఫౌండేషన్ వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలిపింది. రాబడిలో కొంత భాగాన్ని లాభాపేక్షలేని సంస్థలకు విరాళంగా అందించారు. మాయా బజార్ - పరిపూర్ణమైన పేరు. అపూర్వమైన అంచనాలను దాటిందనే పేరు తెచ్చుకుంది. మాయా బజార్‌కు హాజరైన ప్రతి ఒక్కరూ చిరునవ్వులు చిందించారు. చాలా కాలం పాటు నెమ‌రువేసుకునే ఎన్నో జ్ఞాపకాలతో ఇంటికి తిరిగి వెళ్లారు. మాయా బజార్ ఇప్పుడు భారతీయ కమ్యూనిటీలో ఒక ల్యాండ్‌మార్క్ ఈవెంట్‌గా నిలిచింద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.


Read more