ఓ ప్రయాణీకుడు నడుస్తున్న తీరును చూసి విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులకు డౌట్.. చివరకు ఏం తేలిందంటే..

ABN , First Publish Date - 2022-07-14T16:00:57+05:30 IST

అది దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో(IndiGo 6E 1088) విమానం. లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులందరూ ఇమ్మిగ్రేషన్ క్లియరేన్స్ కోసం క్యూ నిల్చున్నారు.

ఓ ప్రయాణీకుడు నడుస్తున్న తీరును చూసి విమానాశ్రమంలో కస్టమ్స్ అధికారులకు డౌట్.. చివరకు ఏం తేలిందంటే..

లక్నో: అది దుబాయ్ నుంచి వచ్చిన ఇండిగో(IndiGo 6E 1088) విమానం. లక్నో విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. ప్రయాణికులందరూ ఇమ్మిగ్రేషన్ క్లియరేన్స్ కోసం క్యూ నిల్చున్నారు. అందులో ఓ ప్రయాణీకుడి నడకపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దాంతో అతడిని క్యూ నుంచి బయటకు పిలిచి ప్రశ్నించారు. అక్కడ అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అధికారుల అనుమానం మరింత బలపడింది. వెంటనే సదరు ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం చెప్పాడు. అది విన్న అధికారులు షాక్ అయ్యారు. అసలు ప్రయాణీకుడు అధికారులతో చెప్పిన షాకింగ్ విషయం ఏంటి? పూర్తి విచారణ అనంతరం అతడి నుంచి అధికారులు బంగారం స్వాధీనం చేసుకోవడం. దాన్ని ప్రయాణికుడు ఎక్కడ దాచిపెట్టి తెచ్చాడు? అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణీకుడు లక్నో ఎయిర్‌పోర్టులో దిగి ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ కోసం క్యూలో ఉండగా అక్కడే విధులలో ఉన్న కస్టమ్స్ అధికారులకు అతడి నడకపై అనుమానం కలిగింది. కొద్దిసేపు ప్రయాణీకుడిని బాగా పరిశీలించిన అధికారులకు అతడి వ్యవహారం కచ్చితంగా తేడా ఉందని నిర్ధారణకు వచ్చారు. దాంతో వెంటనే రంగంలోకి దిగిన కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని క్యూ నుంచి బయటకు పిలిచి మాట్లాడారు. అయితే, అధికారులు అడిగిన ప్రశ్నలకు ప్రయాణీకుడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారి అనుమానం మరింత బలపడింది. అతడిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి అధికారులు మరోసారి గట్టిగా ప్రశ్నించారు. అప్పుడు అసలు నిజం చెప్పాడు. తాను గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నట్టు అంగీకరించాడు. అయితే, అధికారులు ఎక్కడ దాచి తీసుకువచ్చావంటూ ప్రయాణికుడిని అడిగారు. దానికి ఆయన చెప్పిన సమాధానం విని అధికారులు షాక్ అయ్యారు. 


ఎందుకంటే.. అతడు బంగారాన్ని తన పురీషనాళం (Rectum)లో దాచి తీసుకువచ్చినట్లు వెల్లడించాడు. దాంతో అధికారులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి బంగారం బయటకు తీశారు. పేస్టు రూపంలో మార్చి బ్లాక్‌టేప్‌లో రెండు పోట్లాలుగా చూట్టి దాని రెక్టంలో దాచాడు. అలా ఆ రెండు పోట్లాలలో సుమారు 433 గ్రాముల బంగారం తీసుకొచ్చాడు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం తాము స్వాధీనం చేసుకున్న 433 గ్రాముల పసిడి రూ.20.6లక్షలు పలుకుతుందని అధికారులు వెల్లడించారు. అయితే, దుబాయ్ నుంచి లక్నో రావడానికి మొత్తం జర్నీ సమయం మూడున్నర గంటలు. అంతసేపు సదరు ప్రయాణీకుడు సుమారు హాఫ్ కేజీ గోల్డ్‌ను పురీషనాళంలో దాచుకోవడం ఆశ్చర్యం కలిగించిందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకుని మిగతా వివరాల కోసం విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.   


Read more