Qatar: భారతీయుడికి జాక్ పాట్.. స్నేహితులతో కలిసి చేసిన ఒకే ఒక్క పని వల్ల

ABN , First Publish Date - 2022-09-22T01:00:08+05:30 IST

స్నేహితులతో కలిసి చేసిన ఓ చిన్న పని వల్ల భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. దీంతో అతడు లక్షాధికారి అయ్యాడు. పెద్ద మొత్తంలో డబ్బులు గెలవడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా

Qatar: భారతీయుడికి జాక్ పాట్.. స్నేహితులతో కలిసి చేసిన ఒకే ఒక్క పని వల్ల

ఎన్నారై డెస్క్: స్నేహితులతో కలిసి చేసిన ఓ చిన్న పని వల్ల భారతీయుడికి జాక్ పాట్ తగిలింది. దీంతో అతడు లక్షాధికారి అయ్యాడు. పెద్ద మొత్తంలో డబ్బులు గెలవడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఇంతకూ జాక్ పాట్ కొట్టిన వ్యక్తి ఎవరు? స్నేహితులతో కలిసి ఏం చేశాడు? ఎంత మొత్తంలో అతడు డబ్బులు గెలుపొందాడు? అనే వివరాల్లోకి వెళితే..



కేరళ(Kerala)కు చెందిన రాగేష్ శశిధరన్ గత కొన్నేళ్ల క్రితం ఖతర్(Qatar) వెళ్లాడు. అక్కడ రిటైల్ ఇండస్ట్రీలో ఉద్యోగం చేస్తూ కొంత మొత్తాన్ని ఇండియాలోని కుటుంబ సభ్యులకు డబ్బులు పంపిస్తున్నాడు. అయితే తాజాగా ఇతడు.. తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే స్నేహితులతో కలిసి అబుధాబి బిగ్ టికెట్‌(Big Ticket Abu Dhabi)లో పాల్గొన్నాడు. టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో తాజాగా జరిగిన వీక్లి డ్రాలో అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు జాక్‌ పాట్ తగిలింది. 3లక్షల దిన్హార్లు (సుమారు రూ.65లక్షలు) గెలుపొందాడు. దీంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ మొత్తాన్ని స్నేహితులతో కలిసి పంచుకోనున్నట్టు పేర్కొన్నాడు. అంతేకాకుండా వాటా ప్రకారం తనకు వచ్చిన డబ్బును పిల్లల చదువు కోసం ఉపయోగిస్తానని వెల్లడించాడు.


Updated Date - 2022-09-22T01:00:08+05:30 IST