బ్రిటన్ ప్రధాని ‘ఇంటరాగేషన్’ వీడియో వైరల్..!

ABN , First Publish Date - 2022-07-18T03:37:25+05:30 IST

నేటి సోషల్ మీడియా సమాజంలో సృజనాత్మకతకు, దాన్ని ప్రదేశించే వేదికలకు కొదవే లేదు..! అందుకే సోషల్ మీడియాలో తరచూ ఏదోక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం..

బ్రిటన్ ప్రధాని ‘ఇంటరాగేషన్’ వీడియో వైరల్..!

ఎన్నారై డెస్క్: నేటి సోషల్ మీడియా సమాజంలో సృజనాత్మకతకు, దాన్ని ప్రదేశించే వేదికలకు కొదవే లేదు..! అందుకే సోషల్ మీడియాలో తరచూ ఏదోక వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో... ‘బ్రిటన్ ప్రధాని ఇంటరాగేషన్’. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris johnson) వీడియోలను, బ్రిటన్‌లోని పాపులర్ టీవీ సీరియల్‌లోని దృశ్యాలను ఎడిటింగ్ టెక్సిక్స్‌ సాయంతో కలగలిపి చేసి వీడియో ఇది. ఇందులో పోలీసు బృందం ఒకటి బోరిస్‌ను వీర లెవల్లో ఇంటరాగేట్ చేస్తుంది. బ్రిటన్ విలువలను,  వ్యవస్థల స్థాయిని దిగజార్చావంటూ పోలీసులు కడిగిపారస్తారు. బోరిస్ ఏమో పశ్చాత్తాపంతో తలదించుకున్నట్టు కనిపిస్తారు. వివిధ సందర్భాల్లో బోరిస్ జాన్సన్ హావాభాల తాలూకు వీడియోను రికార్డు చేసి ఈ వీడియోకు జత చేయడంతో వీడియో క్లిప్ మొత్తం ఆసాంతం ఆకట్టుకునేలా సాగుతుంది. వీడియో సృష్టికర్త టాలెంట్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 

Read more