కెనడాలో దాదాపు పది లక్షల ఉద్యోగావకాశాలు..

ABN , First Publish Date - 2022-09-25T05:07:56+05:30 IST

కెనడాలోని వివిధ రంగాల్లో ప్రస్తుతం దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి.

కెనడాలో దాదాపు పది లక్షల ఉద్యోగావకాశాలు..

ఎన్నారై డెస్క్: కెనడాలోని(Canada) వివిధ రంగాల్లో ప్రస్తుతం దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఉద్యోగావకాశాలు, జీతనాతాలకు సంబంధించి తాజాగా విడుదలైన ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఉద్యోగ ఖాళీల సంఖ్య(Job vacancies) 4.7 శాతం మేర పెరిగింది. గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే.. ఇది 42.3 శాతం ఎక్కువ. ఈ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ఉద్యోగఖాళీల సంఖ్య 997,000. దీంతో.. వ్యాపార సంస్థలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక రెండో త్రైమాసికంలో కెనడా జాబ్ వేకెన్సీ రేట్(మొత్తం ఉద్యోగాలలో ఖాళీల వాటా) 5.7 శాతంగా ఉన్నట్టు తేలింది. ఇంతకముందెన్నడూ ఈ స్థాయిలో జాబ్ వేకెన్సీ రేట్ పెరగలేదని చెబుతారు. 

Read more