NRI Last Message: లండన్‌కు వెళ్లి కంపెనీ పెట్టి కోట్ల సంపాదన.. కానీ భార్య నిర్వాకం భరించలేక ఆత్మహత్య.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2022-09-24T17:38:14+05:30 IST

చిన్నప్పుడే ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. పెద్దాయక పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు 25 ఏళ్లు. పెళ్లి బంధంలో అడుగుపెట్టి 15 ఏళ్లు.

NRI Last Message: లండన్‌కు వెళ్లి కంపెనీ పెట్టి కోట్ల సంపాదన.. కానీ భార్య నిర్వాకం భరించలేక ఆత్మహత్య.. అసలు కథేంటంటే..

ఎన్నారై డెస్క్: చిన్నప్పుడే ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. పెద్దాయక పెద్దలను ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు 25 ఏళ్లు. పెళ్లి బంధంలో అడుగుపెట్టి 15 ఏళ్లు. జైపూర్ నుంచి వెళ్లి లండన్‌లో ఉంటున్నారు. అతడికి అక్కడ సొంత కంపెనీ, కోట్లలో సంపాదన. లైఫ్‌లో ఎలాంటి సమస్యలు లేవు. అయితే, సాఫీగా సాగిపోతున్న వారి జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశంతో ఒక్కసారిగా అన్ని మారిపోయాయి. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే భార్య మరో వ్యక్తితో సాన్నిహిత్యంగా మెలగడం అతడు తట్టుకోలేకపోయాడు. భార్యను తీరు మార్చుకోవాలని చెప్పిచూశాడు. కానీ, అది జరగకపోగా భార్య విడాకుల కోసం కోర్టుకు ఎక్కింది. అప్పటి నుంచి ఆమె గురించి తలచుకుంటూ తనలో తానే కుమిలిపోయాడు. భార్య తనకు విడాకులు కావాల్సిందేనని పట్టుబట్టడంతో తీవ్ర మానసిక క్షోభను అనుభవించాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా చేయడంతో ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక తనలో తానే మదనపడిపోయాడు. భార్యకు ఎంత సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. ప్రాణంగా ప్రేమించే భార్య దూరం అవుతుండడం తట్టుకోలేకపోయాడు. చివరకు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. లండన్‌లో తాను నివాసముండే భవనంపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఇలా జైపూర్‌లో మొదలైన అతడి లవ్ స్టోరీ లండన్‌లో ఆత్మహత్యతో ముగిసింది. 


అసలేం జరిగిందంటే.. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని మాలవియా నగర్ సెక్టార్-2కు చెందిన సుమిత్(38) 15 ఏళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడే సుమిత్ ఆమెపై ఇష్టం పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె కూడా సుమిత్‌ను ఇష్టపడింది. అలా పదేళ్లు ఇద్దరూ ప్రేమలో మునిగితేలారు. ఆ తర్వాత పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. పెద్దలు కూడా వారి ప్రేమను అర్థం చేసుకుని 2007 ఇద్దరికి పెళ్లి చేశారు. ఆ తర్వాత ఏడాది సుమిత్‌కు లండన్‌లో ఉద్యోగం వచ్చింది. దాంతో దంపతులిద్దరూ లండన్‌కు మకాం మార్చారు. అక్కడికి వెళ్లిన కొన్నాళ్ల వరకు బాగానే ఉన్నారు. 


ఆ తర్వాత పిల్లల విషయమై ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. సుమిత్ పిల్లలు కావాలని చెబితే.. ఆమె మాత్రం ఇప్పుడే వద్దని చెప్పేది. ఈ క్రమంలో సుమిత్‌కు 2016లో బ్రిటన్ పౌరసత్వం వచ్చింది. దాంతో 2019లో మరికొందరు స్నేహితులతో కలిసి ఓ ప్రైవేట్ కంపెనీ ప్రారంభించాడు. ఆ కంపెనీ ప్రారంభంతో సుమిత్ సంపాదన పెరిగింది. సొంత ఇల్లు కొనుగోలు చేశాడు. అంతా సాఫీగా సాగిపోతుంది. అయితే, ఉన్నట్టుండి భార్య అతడిని దూరం పెట్టడం మొదలెట్టింది. మొదట ఏదో తరచూ వచ్చే గొడవలే కారణం కావొచ్చని సుమిత్ లైట్‌ తీసుకున్నాడు. 


కానీ, ఆ తర్వాత భార్య గురించి అతడికి తెలిసిన విషయం గుండె ఆగిపోయేలా చేసింది. భార్య బ్రిటన్‌లోనే ఉండే రచిత్ అనే వ్యక్తితో సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు తెలుసుకున్నాడు. భార్యను తీరు మార్చుకోవాలని చెప్పాడు. కానీ, ఆమె వినిపించుకోలేదు. సుమిత్‌ను శాశ్వతంగా దూరం చేసుకోవాలని రెండేళ్ల కింద విడాకుల కోసం దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి సుమిత్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా చేయడం తట్టుకోలేకపోయాడు. భార్య నిర్వాకం బయటకు చెప్పుకోలేక తనలోతానే కుమిలిపోయాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆమె మనసు మాత్రం మారలేదు. తనకు విడాకులు కావాల్సిందేనని పట్టుబట్టింది. 


దాంతో ఇక భార్య తన మాట వినదని, ఈ విషయం బయటకు తెలిస్తే తన పరువు పోతుందని భావించిన సుమిత్ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 16న స్నేహితులందరినీ తన ఇంటికి పిలిచి పార్టీ ఇచ్చాడు. వారందరూ వెళ్లిపోయాక సాయంత్రం 4 గంటల సమయంలో భార్యతో మరోసారి చెప్పిచూశాడు. కానీ, ఆమె ససేమీరా అనడంతో తాను నివాసం ఉంటున్న భవనం ఆరో అంతస్తుపై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే, ఆత్మహత్యకు 3 నిమిషాల ముందు సూసైడ్‌ నోట్ రాశాడు. దాన్ని తన సోదరితో పాటు ప్రాణ స్నేహితుడికి పంపించాడు. అందులో.. తనకు ఇంతవరకు సహకరించిన కంపెనీ స్టాప్‌, స్నేహితులకు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే తనకు ఎలాంటి అప్పులు లేవని, తాను సంపాదించిన ఆస్తులన్నీ తన తల్లిదండ్రులకే ఇవ్వాలని రాసుకొచ్చాడు. ఇలా జైపూర్‌లో మొదలైన సుమిత్ లవ్ జర్నీ లండన్‌లో సూసైడ్‌తో ఎండ్ అయింది. ఇక కుమారుడి ఆత్మహత్యతో పేరెంట్స్ గుండెలవిసెలా రోదిస్తున్నారు.  

Read more