ప్రవాస Teachers కు ముఖ్య గమనిక.. Residency రెన్యువల్‌కు కొత్త మెలిక

ABN , First Publish Date - 2022-06-23T14:28:44+05:30 IST

కువైత్‌లోని ప్రవాస టీచర్ల కోసం ఆ దేశ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.

ప్రవాస Teachers కు ముఖ్య గమనిక.. Residency రెన్యువల్‌కు కొత్త మెలిక

కువైత్ సిటీ: కువైత్‌లోని ప్రవాస టీచర్ల (Expat Teachers) కోసం ఆ దేశ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ప్రవాస ఉపాధ్యాయులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ట్రాఫిక్ జరిమానాలు ఉంటే చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. లేనిపక్షంలో రెసిడెన్సీ రెన్యువల్ చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్కడి స్కూళ్లకు ఓ సర్క్యూలర్ జారీ చేసింది. స్కూళ్లలో పనిచేస్తున్న ప్రవాస టీచర్లు, నాన్-టీచింగ్ సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేయాలని సర్క్యూలర్‌లో పేర్కొంది. అలాగే ప్రవాసులు తమ రెసిడెన్సీ రెన్యువల్ (Residency Renewal) కోసం పాటించాల్సిన నిబంధనలు తెలియజేసింది. 


రెసిడెన్సీ రెన్యువల్ కోసం ప్రవాస టీచర్లు పాటించాల్సిన నిబంధనలు..

1. గడువు ముగియడానికి 3 నెలల ముందు రెసిడెన్సీ రెన్యూవ్ చేయబడదు

2. టీచర్లు ముందుగా విద్యాశాఖ వెబ్‌సైట్  https://moe.edu.kw. ద్వారా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి

3. అపాయింట్‌మెంట్‌లో ఇచ్చిన తేదీకి కచ్చితంగా ఎవరైతే తమ రెసిడెన్సీని రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారో వారే స్వయంగా సంబంధిత కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది

4. రెసిడెన్సీ రెన్యువల్ కోసం కావాల్సిన ధృవపత్రాలు

* స్కూల్ యాజమాన్యం అప్రూవ్ చేసిన Form No. 1, దానిపై స్కూల్ స్టాంప్‌ తప్పకుండా ఉండాలి

* ఒర్జినల్ పాస్‌పోర్ట్, సివిల్ ఐడీలతో పాటు వాటి జిరాక్స్ కాపీలు కూడా తీసుకెళ్లాలి

* ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన కాపీలు(ఒకవేళ ఉంటే)

* కువైత్‌లోకి ప్రవేశించిన చివరి స్టాంప్ కాపీ.

Updated Date - 2022-06-23T14:28:44+05:30 IST