భారత సంతతి పోలీస్‌కు భారీ షాక్.. బ్రిటన్ రాకుమారుడి సతీమణి Meghanపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని..

ABN , First Publish Date - 2022-07-04T00:13:25+05:30 IST

బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(Prince Harry) సతీమణి మేఘన్ మర్కెల్‌పై(Meghan markle) జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలు చేసిన భారత సంతతి పోలీస్ కానిస్టేబుల్‌కు భారీ షాక్ తగిలింది. లండన్ మెట్రోపాలిటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. కానిస్టేబుల్‌ సుఖ్‌దేవ్ జీర్‌ను విధుల నుంచి తొలగించింది.

భారత సంతతి పోలీస్‌కు భారీ షాక్..  బ్రిటన్ రాకుమారుడి సతీమణి Meghanపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని..

ఎన్నారై డెస్క్: బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ(Prince Harry) సతీమణి మేఘన్ మర్కెల్‌పై(Meghan markle) జాత్యాహంకార పూరిత వ్యాఖ్యలు చేసిన భారత సంతతి పోలీస్ కానిస్టేబుల్‌కు భారీ షాక్ తగిలింది. లండన్ మెట్రోపాలిటిన్ పోలీస్ డిపార్ట్‌మెంట్.. కానిస్టేబుల్‌ సుఖ్‌దేవ్ జీర్‌ను విధుల నుంచి తొలగించింది. మేఘన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో కానిస్టేబుల్ పాల్ హెప్ఫర్డ్‌నూ ఉద్యోగం నుంచి తీసేసింది. 2018లో నిందితులు తమ వాట్సాప్ గ్రూప్‌లో మేఘన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదంతంపై జరిగిన దర్యాప్తులో నిందితులిద్దరూ తప్పు చేసినట్టు తేలింది. ఈ క్రమంలోనే వారిని పోలీస్ ట్రిబ్యునల్ ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటువంటి చర్యలు క్షమార్హం కావని డిపార్ట్‌మెంట్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ కమాండర్ జాన్ సావెల్ వ్యాఖ్యానించారు. ‘‘2018లో ఓవాట్సాప్‌ గ్రూప్‌లో ఈ కామెంట్స్ ప్రత్యక్షమయ్యాయి. పోలీసులే కాదు ఇటువంటి కామెంట్స్ ఎవరు చేసినా, ఇలా ఎవరు ప్రవర్తించినా ఆమోదయోగ్యం కాదు.’’ అని చెప్పారు.


కాగా..  సెంట్రల్ ఈస్ట్ కామెండ్‌లోని ఫోరెన్సిక్ సర్వీసెస్ శాఖలో నిందితులిద్దరూ కానిస్టేబుల్స్‌గా పనిచేసేవారు. 2017 డిసెంబర్ నుంచి 2018 డిసెంబర్ మధ్య కాలంలో తమ వాట్సాప్‌ గ్రూప్‌లో మేఘన్‌ మర్కెల్‌పై పలు అనుచిత, జాత్యాహంకార విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. హార్యీ, మర్కెల్ వివాహం సందర్భంగా అనుచిత కామెంట్స్ షేర్ చేశారు.  ఆ గ్రూప్‌లో సభ్యుడైన మరో పోలీస్ అధికారి సెల్‌ఫోన్‌ను మరో కేసు దర్యాప్తులో భాగంగా పైఅధికారులు పరిశీలించడంతో ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ‘‘తమ చర్యలతో డిపార్ట్‌మెంట్‌కు తలవంపులు తెచ్చే వారిని ఏరిపారేయడమే మా లక్ష్యం. ఇటువంటి సిగ్గుమాలిన ప్రవర్తనను ఎంత మాత్రం సహించం. ఈ విషయంలో సిబ్బందిని తరచూ హెచ్చరిస్తూనే ఉంటాం.’’ అని కమాండర్ జాన్ పేర్కొన్నారు. ఈ ఉదంతం కారణంగా ప్రజల్లో పోలీసులపై నమ్మకం తగ్గడాన్ని తాము అర్థం చేసుకున్నామని సెంట్రల్ ఈస్ట్ డివిజన్ చీఫ్ సుపరింటెండెంట్ మార్కస్ బార్నెట్ వ్యాఖ్యానించారు. వారికి తగిన శిక్షే పడిందన్నారు. 

Updated Date - 2022-07-04T00:13:25+05:30 IST