అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు..

ABN , First Publish Date - 2022-08-02T03:20:04+05:30 IST

టెలీ మార్కెటింగ్ స్కామ్‌లో నిధుల అక్రమ తరలింపునకు పాల్పడని ఓ భారత సంతతి వ్యక్తికి అమెరికాలో మూడేళ్ల జైలు శిక్ష పడింది.

అమెరికాలో భారత సంతతి వ్యక్తికి మూడేళ్ల జైలు..

ఎన్నారై డెస్క్: టెలీ మార్కెటింగ్ స్కామ్‌లో(Telemarketing scam) నిధుల అక్రమ తరలింపునకు(Laundering) పాల్పడని ఓ భారత సంతతి వ్యక్తికి(Indian origin) అమెరికాలో మూడేళ్ల జైలు శిక్ష పడింది. తాను తప్పు చేసినట్టు హిరేన్. పి. చౌదని అంగీకరించడంతో శిక్ష ఖరారైంది. సీనియర్ సిటిజన్లే టార్గెట్‌గా సాగుతున్న ఓ టెలీ మార్కెటింగ్ స్కామ్‌లో హిరేన్ కీలకంగా వ్యవహరించారని నార్తర్న్ ఇలినాయ్ డిస్ట్రిక్ట్ అటార్నీ జనరల్ గురువారం పేర్కొన్నారు. 


వివరాలు.. గత రెండేళ్లుగా సాగిన ఓ స్కామ్‌లో అనేక మంది సీనియర్ సిటిజన్లు తమ డబ్బును పోగొట్టుకున్నారు. వివిధ ప్రభుత్వ విభాగాల పేరుతో నిందితులు వృద్ధులకు ఫోన్ చేసి..వారి గుర్తింపు సంఖ్య వంటి కీలక వివరాలు బయటకుపొక్కాయని భయభ్రాంతులకు గురి చేసేశారు. ఆ తరువాత.. తమకు డబ్బు పంపిస్తే అంతా సరైపోతుందంటూ నమ్మబలికేవారు. మోసం జరుగుతున్న విషయాన్ని గుర్తించలేక అనేక మంది నిందితులు కొరిన మొత్తాన్ని వారు సూచించిన అకౌంట్లకు బదిలీ చేసేవారు. అయితే.. నకిలీ గుర్తింపు కార్డులతో(Fake documents) హిరేన్ తెరిచిన అకౌంట్లలోకి కొన్ని నిధులు వచ్చేవని అటార్నీ జనరల్ తెలిపారు. పదవీ విరమణ పొందిన నర్సు ఒకరు ఇలా 9 లక్షల డాలర్లను కోల్పోయారని చెప్పారు. హిరేన్ ఏర్పాటు చేసిన అకౌంట్లతో పాటూ అతడికి తెలిసిన వారి అకౌంట్లలోకి కూడా ఈ మొత్తం డిపాజిట్ అయిందని తెలిపారు. 

Read more