విదేశీ కోడలికి మన వంటకాలు నేర్పిస్తున్న అత్త..వీడియో వైరల్

ABN , First Publish Date - 2022-08-28T05:21:48+05:30 IST

భిన్న నేపథ్యాలు, విభిన్న సంస్కృతుల నుంచి వచ్చే ఆ భార్యభర్తల సంసార జీవితంలో భలే ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటాయి.

విదేశీ కోడలికి మన వంటకాలు నేర్పిస్తున్న అత్త..వీడియో వైరల్

ఎన్నారై డెస్క్: చదువనో.. ఉద్యోగమనో విదేశాలకు వెళ్లిపోతున్న భారతీయులు అక్కడి వారిని వివాహాలు చేసుకుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. భిన్న నేపథ్యాలు, విభిన్న సంస్కృతుల నుంచి వచ్చే ఆ భార్యభర్తల  సంసార జీవితంలో భలే ఆసక్తికర విషయాలు చోటుచేసుకుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దక్షిణాదికి చెందిన ఓ మహిళ తన విదేశీ కోడలికి(Daughter-in-law) వంటలు ఏలా చేయాలో నేర్పిస్తున్న సమయంలో తీసిన వీడియో! నెదర్లాండ్స్(Netherlands) చెందిన ఆ కోడలేమో బుద్ధిగా తన అత్తగారు చెప్పే సూచనలన్నీ జాగ్రత్తగా పాటిస్తూ ఇడ్లీ(Idli), దోస(Dosa), కాఫీ వగైరాలన్నీ సిద్ధం చేస్తుంది. అంతేకాకుండా.. పెద్దల పట్ల భక్తిప్రపత్తులు కలిగిన కోడలిగా..ఇంట్లోని వృద్ధులకు కావాల్సినవి అందిస్తుంది కూడా.. వీడియోలో ఇదంతా చూస్తున్న నెటిజన్ల తెగ మురిసిపోతున్నారు. సీన్ భలేగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. వీడియోలోని వంటలు చూస్తుంటే నాకు నోరూరుతోందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ ఆసక్తికర వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!  Read more