Canada: కెనడాలో కాల్పులు.. 28ఏళ్ల భారత యువకుడు మృతి!

ABN , First Publish Date - 2022-09-19T16:30:37+05:30 IST

కెనడా(Canada)లో గత సోమవారం చోటు చేసుకున్న కాల్పుల్లో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడుకు

Canada: కెనడాలో కాల్పులు.. 28ఏళ్ల భారత యువకుడు మృతి!

ఎన్నారై డెస్క్: కెనడా(Canada)లో గత సోమవారం చోటు చేసుకున్న కాల్పుల్లో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య bకు చెరింది. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇండియాకు చెందిన సాత్విందర్ సింగ్(Indian Student) అనే 28ఏళ్ల యువకుడు ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లారు. ఒంటారియాలోని మిల్టన్ ఏరియాలో నివాసం ఉంటూ కాలేజీకి వెళ్తుంటాడు. కాగా.. గత సోమవారం గ్రేటర్ టెరెంటో ప్రాంతంలో ఓ దుండగుడు జరిపిన కాల్పల్లో సాత్విందర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు స్థానికంగా ఉన్న హామిల్టన్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రోజు సాత్విందర్ సింగ్ మరణించాడు. ఈ విషయాన్ని కెనడా పోలీసులు (Canada Police) ఓ ప్రకటనలో వెల్లడించారు. 



స్వాత్విందర్ సింగ్ కుటుంబ సభ్యులకు సానుభూతి  వ్యక్తం చేసిన అధికారులు.. సోమవారం చోటు చేసుకున్న ఘటనను మరవకముందే.. హృదయవిదారకమైన వార్తను వినాల్సి వచ్చిందన్నారు. అంతేకాకుండా.. అత్యవసర సందర్భాల్లో సహాయం కోసం తమను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఇదిలా దుండగుడు జరిపిన కాల్పుల్లో స్పాట్‌లోనే ఓ పోలీస్ అధికారి సహా మరో సామాన్య పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం దుండగుడు పోలీసుల చేతిలో హతం అయ్యాడు. నిందుడిని శ్వాన్ పిట్రీగా గుర్తించారు. 


Updated Date - 2022-09-19T16:30:37+05:30 IST