Kuwait కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణీకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి పాస్‌పోర్టులను చెక్ చేస్తే వెలుగులోకి షాకింగ్ నిజం..!

ABN , First Publish Date - 2022-10-05T13:05:50+05:30 IST

అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కువైత్ (Kuwait) వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎయిర్‌పోర్టు పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద సరియైన ధృవపత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు.

Kuwait కు వెళ్తున్న ఇద్దరు ప్రయాణీకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి పాస్‌పోర్టులను చెక్ చేస్తే వెలుగులోకి షాకింగ్ నిజం..!

కువైత్ సిటీ: అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి కువైత్ (Kuwait) వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఎయిర్‌పోర్టు పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద సరియైన ధృవపత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు వారు భారతీయులే కాదని, ఫోర్జరీ పాస్‌పోర్టుతో కువైత్ వెళ్తున్నట్లు తెలిసి షాకయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం (Sardar Vallabhbhai Patel Airport)లో ఇద్దరు వ్యక్తులు కువైత్ వెళ్లేందుకు విమానం కోసం వేచి చూస్తున్నారు. అయితే, వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం చెప్పడంతో ఇమ్మిగ్రేషన్ అధికారుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారి పాస్‌పోర్టులను తనిఖీ చేయగా షాకింగ్ విషయం తెలిసింది. 


అసలు వారు భారతీయులే కాదని, ఫోర్జరీ చేసిన భారత పాస్‌పోర్ట్(Indian passport)పై కువైత్ వెళ్తున్నట్లు గుర్తించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో వారిద్దరూ బంగ్లాదేశీయులని తేలింది. వారిని షాహిదుల్లా మోల్లా(25), అమినుల్ ఇస్లాం(26)గా గుర్తించారు. గత కొంతకాలంగా వారు కోల్‌కతాలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. వారు నివాసం ఉంటున్న చిత్పూర్ రిజియన్‌లోని కొస్సిపూర్ అడ్రస్‌పై తమ పేర్లను మార్చుకుని మొదట ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించారు. ఆ తర్వాత ప్రకాష్ బైద్యా పేరుతో మోల్లా, తపస్ మోండల్ పేరుతో ఇస్లాం పాస్‌పోర్టులను పొందినట్లు అధికారులు గుర్తించారు. వాటితోనే వారిద్దరూ కువైత్ వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ పని దొరకడంతో నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి వెళ్లేందుకు యత్నించినట్లు వారు విచారణలో ఒప్పుకున్నారు. కాగా, షాహిదుల్లా మోల్లాది బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని మగురా జిల్లా కాగా, అమినుల్ ఇస్లాంది సత్ఖిరా జిల్లాగా అని అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-10-05T13:05:50+05:30 IST