భారతీయుడికి సర్‌ప్రైజ్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు.. ఏకంగా అతడు పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి మరీ..

ABN , First Publish Date - 2022-11-23T15:48:59+05:30 IST

ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయుడికి అక్కడి పోలీసులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా అతడు పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి మరీ..

భారతీయుడికి సర్‌ప్రైజ్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు.. ఏకంగా అతడు పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి మరీ..

ఎన్నారై డెస్క్: ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయుడికి అక్కడి పోలీసులు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఏకంగా అతడు పని చేస్తున్న ప్రాంతానికి వెళ్లి మరీ ప్రత్యేకంగా అభినందించారు. దీంతో అతడికి సంబంధించిన వార్త స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఇంతకూ అతడు ఎవరు? దుబాయ్ పోలీసులు భారతీయుడిని ఎందుకోసం అభినందించారు? అనే విషయాలు తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..

ఇండియాకు చెందిన కెశూర్(Keshur) అనే వ్యక్తి.. ఉద్యోగం కోసం కన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అనంతరం అక్కడ ఓ సంస్థలో పనికి కుదిరాడు. ఈ క్రమంలో అతడు తాజాగా ధైర్య సాహసాలను ప్రదర్శించాడు. భారీ మొత్తంలో డబ్బుతో కూడిన బ్యాగులతో ఇద్దరు ఆసియన్ పౌరులు నైఫ్ ఏరియాలో వెళ్తుండగా.. ఓ దొంగ వారి వద్ద నుంచి డబ్బులు దొంగిలించాడు. ఆ విషయాన్ని గుర్తించిన కెశూర్.. దొంగ వెనక పరుగు తీసి, అతడిని పట్టుకున్నాడు. అనంతరం హీరో లెవల్‌లో ఫైట్ చేసి మరీ పోలీసులు వచ్చేంత వరకూ దొంగను బంధించాడు. ఈ నేపథ్యంలోనే అక్కడకు చేరుకున్న పోలీసులు సదరు దొంగను అరెస్టు చేసి, జైలుకు తరలించారు.

కాగా.. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి దొంగను బంధించిన కెశూర్‌కు దుబాయ్ పోలీస్ ఉన్నతాధికారులు తాజాగా సర్‌ప్రైజ్ ఇచ్చారు. అతడు పని చేసే ప్రదేశానికి వెళ్లి, మరీ మెమోంటలను అంధించి.. కెశూర్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో కెశూర్ స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.

Updated Date - 2022-11-23T16:05:38+05:30 IST

Read more