Kuwait: మసీదులో భారత ప్రవాసుడు ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-12-06T07:52:56+05:30 IST

కువైత్‌లోని (Kuwait) కార్డోబా ప్రాంతంలోని అల్-ఘనిమ్ మసీదులో (Mosque) ఓ భారత ప్రవాసుడు (Indian expat) ఆత్మహత్యాయత్నం చేశాడు.

Kuwait: మసీదులో భారత ప్రవాసుడు ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..

కువైత్ సిటీ: కువైత్‌లోని (Kuwait) కార్డోబా ప్రాంతంలోని అల్-ఘనిమ్ మసీదులో (Mosque) ఓ భారత ప్రవాసుడు (Indian expat) ఆత్మహత్యాయత్నం చేశాడు. పదునైన వస్తువుతో తనను తాను పొడుకున్నాడు. ఇది గమనించిన తోటివారు అంబులెన్స్ , పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వెంటనే అత్యవసర అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని భారతీయ వ్యక్తిని ప్రథమ చికిత్స చేసింది. ఆ తర్వాత సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సదరు వ్యక్తి పొడుచుకున్న వస్తువును స్వాధీనం చేసుకున్నారు. ప్రథమ చికిత్స తర్వాత అతడి ఆరోగ్యం మెరుగు పడడంతో అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు (Police Station) తరలించారు. అయితే, ఆ భారత వ్యక్తి ఎవరు? ఎందుకు అతడు ఇలా మసీదులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు? తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. కాగా, అధికారిక సమాచారం ప్రకారం విచారణ అనంతరం భారత ప్రవాసుడిని దేశం నుంచి బహిష్కరించబడతాడని తెలుస్తోంది.

Updated Date - 2022-12-06T07:52:59+05:30 IST