75వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. మాజీ సైనికుల త్యాగాలను స్మరించుకున్న Indian Embassy

ABN , First Publish Date - 2022-07-04T18:38:26+05:30 IST

భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం అవుతున్న వేళ.. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం సోమవారం Varishtha Yoddha కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ అంబాసిడర్ తరణ్‌జి

75వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. మాజీ సైనికుల త్యాగాలను స్మరించుకున్న Indian Embassy

ఎన్నారై డెస్క్: భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలకు సిద్ధం అవుతున్న వేళ.. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం సోమవారం Varishtha Yoddha కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఇండియన్ అంబాసిడర్ తరణ్‌జిత్ సింగ్ సంధూ.. అమెరికాలో నివసిస్తున్న భారత మాజీ సైనికులను గౌరవించారు. దేశానికి వాళ్లు చేసిన సేవ.. త్యాగాలను కొనియాడారు. తరణ్‌జిత్ సింగ్ సంధూ మాట్లాడుతూ.. ‘మిత్రులారా.. మీరంతా అత్యంత కర్తవ్య భావంతో, ఎలాంటి స్వార్థం లేకుండా భారతమాత కోసం సేవ చేశారు. సేవలో భాగంగా ఎన్నో త్యాగాలు చేశారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా అమెరికాలో నివసిస్తూ 4 మిలియన్ల మంది ఉన్న భారతీయ కమ్యూనిటీలో భాగమై.. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మీ త్యాగాలను గుర్తించి.. ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది’ అని అన్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో 1999లో జరిగిన కార్గిల్ వార్ సహా 1948, 1962, 1965, 1971, 1985 సంవత్సరాల్లో భారత ప్రభుత్వం నిర్వహించిన అనేక ఇతర ఆపరేషన్లలో పాల్గొన్న త్రివిధ దళాలలకు చెందిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 140 కంటే ఎక్కువ మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. Varishtha Yoddha కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను తరణ్‌జిత్ సింగ్ సంధూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 
Read more