వామ్మో.. గంటకు రూ.7400 వేతనమా..? California లో అత్యధిక జీతాన్నిచ్చే జాబ్ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-07T21:55:46+05:30 IST

ఓవైపు భయపెడుతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో ఒడిదుడుకులు తప్పవన్న అంచనాలు.. ఇదీ ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి! ఈ నేపథ్యంలో కెనడా ఇన్సూరెన్స్ సంస్థ policyadvisor.com అమెరికాలోని వేతనాలపై

వామ్మో.. గంటకు రూ.7400 వేతనమా..? California లో అత్యధిక జీతాన్నిచ్చే జాబ్ ఏంటంటే..

ఎన్నారై డెస్క్: ఓవైపు భయపెడుతున్న ద్రవ్యోల్బణం.. మరోవైపు ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో ఒడిదుడుకులు తప్పవన్న అంచనాలు.. ఇదీ ప్రస్తుతం అమెరికాలో పరిస్థితి! ఈ నేపథ్యంలో కెనడా ఇన్సూరెన్స్ సంస్థ PolicyAdvisor.com అమెరికాలోని వేతనాలపై ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అమెరికాలో వివిధ రాష్ట్రాల్లో అత్యధిక వేతనాలు పొందుతున్న ఉద్యోగులు ఏ రంగానికి చెందిన వారో తెలుసుకునేందుకు..బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్‌టిక్స్ సమాచారాన్ని విశ్లేషించింది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 


గంటకు సగటున రూ.7400 వేతనం.. కాలిఫోర్నియాలో డెంటిస్టులే టాప్..!

ఈ సర్వే ప్రకారం.. కాలిఫోర్నియాలోని(California) డెంటిస్టులు సగటున గంటకు 95.26 డాలర్ల జీతం(సుమారు రూ. 7400) తీసుకుంటూ యావత్ రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలిచారు. మరోవైపు.. 11 రాష్ట్రాల్లో ఫ్యామిలీ ఫిజీషియన్‌లే అత్యధిక సగటు వేతనాలతో టాప్‌లో ఉన్నారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫిజీషియన్లు గరిష్ఠంగా గంటకు 99.98 డాలర్ల వేతనం పొందుతున్నట్టు ఈ సర్వే తేల్చింది. రోడ్‌ఐల్యాండ్ రాష్ట్రంలోని వైద్యులు మాత్రం కనిష్ఠంగా గంటకు 81.78 డాలర్లే తీసుకుంటున్నారట. మరో ఐదు రాష్ట్రాల్లో డెంటిస్టులు, పోడియాట్రిస్ట్‌లు, నర్సులు, అనస్తీషియా డాక్టర్లు టాప్ పొజిషన్‌లో ఉన్నారు. కనెక్టీకట్‌లో వేతనాల పరంగా తొలి స్థానంలో ఉన్న డెంటిస్టులు గంటకు సగటున 95.82 డాలర్ల వేతనం ఆర్జిస్తున్నారు. నెబ్రాస్కాలో పోడియాట్రిస్ట్‌లే టాప్‌లో ఉన్నారు. వారి సగటు వేతనం గంటకు 99.89 డాలర్లు. ఐయోవా రాష్ట్రంలో ముందువరుసలో ఉన్న అనస్తీషియా వైద్యుల సగటు వేతనం గంటకు 96.95 డాలర్లు! 40 రాష్ట్రాల్లో వైద్య రంగంలోని వారే సగటున అత్యధిక వేతనం తీసుకుంటున్నట్టు ఈ సర్వేలో తేలింది.  


వైద్య రంగానికి ఆవల అత్యధిక వేతనం పొందుతున్న వారు సీఈఓలే! అయితే.. వైద్యులు, సీఈఓలే కాకుండా ఇతర రంగాల్లోని వారు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే శాలరీలు పొందుతున్నట్టు ఈ సర్వే తేల్చింది. హవాయీలోని ఖగోళశాస్త్రజ్ఞుల సగటు వేతనం గంటకు 87.47 డాలర్లుగా తేలింది. ఇక ఇలినాయ్ రాష్ట్రంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కూడా మంచి వేతనం పొందుతున్న వారి జాబితాలో చోటుదక్కించుకున్నారు. వీరి సగటు వేతనం గంటకు 76.93 డాలర్లు. అయితే.. వయోమింగ్ రాష్ట్రంలో జీతాల పరంగా టాప్‌లో ఉన్న వారి సగటు వేతనం ఇతర రాష్ట్రాల్లో కంటే తక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. ఆ రాష్ట్రంలో.. సైంటిఫిక్ ఉత్పత్తుల సేల్స్ రిప్రజెంటేటివ్‌లు టాప్‌లో ఉండగా వారి సగటు వేతనం గంటకు కేవలం 64.05 డాలర్లు! అయితే.. వైద్యులతో పాటూ ఇతర రంగాల్లోని వారు కూడా అత్యధిక వేతనాలు పొందుతుండటం సంతోషం కలిగించే అంశమని PolicyAdvisor.com ఓ ప్రకటనలో తెలిపింది. Read more